దివ్యాంగుల కోసం ఆటల పోటీలు రేపు
ఒంగోలు: దివ్యాంగులను ప్రోత్సహించేందుకు ఈనెల 27న స్థానిక మినీ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి గుంటి రాజరాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 17–20 ఏళ్లలోపు సీనియర్ కేటగిరీ వారికి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలిగిన క్రీడాకారులు తమ ఆధార్‌కార్డు నకలుతోపాటు ప్రభుత్వం జారీ చేసిన వైకల్య నిర్ధారణ పత్రాలు తీసుకుని ఈనెల 27న ఉదయం 9 గంటలకు మినీ స్టేడియంలో హాజరై రిపోర్టు చేయాలన్నారు. పూర్తి సమాచారం కోసం సెల్ నంబర్ 9121106840 ను సంప్రదించాలన్నారు.
ఒంగోలు: జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ సీనియర్ సీ్త్ర, పురుష క్రీడాకారుల ఎంపిక దర్శిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాల ఆవరణలో ఈనెల 27న నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి బొడ్డు సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఎంపికలో పాల్గొనేవారు 2005 సంవత్సరం కంటే ముందు జన్మించి ఉండాలి. ఆసక్తిగల వారు ఆధార్‌కార్డు, నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో ఎంపిక ప్రదేశంలో రిపోర్టు చేయాలన్నారు. ఎంపికై న జిల్లా క్రీడాకారులు డిసెంబర్ 1, 2 తేదీల్లో చిత్తూరు జిల్లాలో జరిగే రాష్ట్ర సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని కార్యదర్శి బొడ్డు సుబ్బారావు తెలిపారు.
ఒంగోలు సబర్బన్: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ ఆదేశించారు. ప్రకాశం భవనం నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పురోగతిపై ఆయన సమీక్షించారు. ఇందులో సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నందున ఇతర కార్యక్రమాల పేరుతో ఎస్‌ఐఆర్ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని హెచ్చరించారు. ఎస్‌ఐఆర్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. 2002 నాటి జాబితాతో సరిపోల్చుతూ మ్యాపింగ్ చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ దిశగా పర్యవేక్షించాలని జెడ్పీ సీఈవో చిరంజీవి, డీపీఓ ముప్పూరి వెంకటేశ్వరరావులకు ఆయన చెప్పారు.
యర్రగొండపాలెం: స్పోర్ట్స్ స్కూల్స్‌లో చేరే గిరిజన విద్యార్థులకు ఈ నెల 27, 28వ తేదీల్లో బాలురకు యర్రగొండపాలెం గిరిజన గురుకుల పాఠశాలలో, బాలికలకు నెరవాడ పాణ్యంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఎంపిక చేయనున్నట్లు శ్రీశైలం ఐటీడీఏ పీవో కె.వెంకటశివప్రసాద్ మంగళవారం తెలిపారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని గిరిజన గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, మినీ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులు అర్హులని, ఆసక్తి ఉన్న వారు తాము ప్రస్తుతం చదువుతున్న హెచ్‌ఎం నుంచి ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని ఆయన తెలిపారు. 2025–26 సంవత్సరంలో 6వ తరగతిలో నూతన ప్రవేశాలు, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎస్టీ విద్యార్థులకు స్పోర్ట్స్ సెలక్షన్స్ బాలురకు యర్రగొండపాలెంలోని ఏపీ గిరిజన గురుకుల బాలుర పాఠశాల పీటీజీలో, బాలికలకు నంద్యాల జిల్లా మహానంది మండలం నెరవాడ పాణ్యంలోని బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 6, 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థినులు, ఇతర ఆశ్రమ, ప్రభుత్వ, మినీ గురుకులాల్లో చదువుతున్న ఎస్టీ బాలికలు అర్హులని ఆయన తెలిపారు. వివరాల కోసం యర్రగొండపాలెం బాలురకు సెల్ నంబర్: 95738 79433, 99081 69358, 81796 83770, నెరవాడ బాలికలకు సెల్ నంబర్: 81069 79149, 73372 78997, 99896 47238. 80087 11980లకు సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.


