జిల్లా స్థాయి బేస్‌బాల్ జట్ల ఎంపికలు
సంతనూతలపాడు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్–14, 17 బాలబాలికల బేస్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు మండలంలోని మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ నారాయణరెడ్డి పాల్గొన్నారు. క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు డీ శ్రీనివాసరావు, తిరుమలశెట్టి రవికుమార్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో వివిధ జిల్లాల్లో జరగబోయే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారన్నారు. డైట్ ప్రిన్సిపాల్ సామ సుబ్బారావు, సంతనూతలపాడు ఎంఈవో వెంకారెడ్డి, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఆకుల బ్రహ్మయ్య, స్కూలు ఉపాధ్యాయులు వెంకటేశ్వరరెడ్డి, డైట్ కళాశాల అధ్యాపకులు మెర్సిన్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


