ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు...
క్వారీలు ప్రమాదంలో ఉన్నాయని, తగిన చర్యలు తీసుకోవాలని డైరక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ సేఫ్టీ (డీఎంఎస్) అధికారులకు దృష్టికి తీసుకువెళుతున్నా వారు పట్టించుకున్న దాఖలాల్లేవు. వారు సకాలంలో స్పందించకపోవడంతో బల్లికురవ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బల్లికురవ క్వారీలు ప్రమాదంలో ఉన్నాయని ఈ ఏడాది జనవరి 6వ తేదీన నేరుగా హైదరాబాద్‌లోని డీఎంఎస్ కార్యాలయంలోనే ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు.


