26న రాజ్యాంగ దినోత్సవం
ఒంగోలు సిటీ: ఏపీ పాఠశాల విద్య గౌరవ సంచాలకుల ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉదయం పాఠశాల అసెంబ్లీలో ప్రార్థనా సమావేశంలో విద్యార్థులందరితో రాజ్యాంగ పీఠిక చదివించాలని డీఈఓ కిరణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసంగాలు/సెమినార్లు, క్విజ్, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు, రాజ్యాంగం చరిత్ర, రాజ్యాంగ నిర్మాతల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వెబ్‌సైట్‌లో శ్రీరాజ్యాంగ ప్రజాస్వామ్యంశ్రీపై జరుగుతున్న ఆన్‌లైన్ క్విజ్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు.
● ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు
చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి
ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ప్రకటించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ ఒంగోలు పట్టణ, తాలూకా కార్య నిర్వహక కమిటీ సమావేశం సోమవారం సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. కార్యదర్శి వరకుమార్, ట్రెజరర్ రంగారెడ్డి, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, తాలూకా అధ్యక్షుడు సురేష్ బాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు రజిత మానస, చంద్రశేఖర్, శ్రీనివాసులు, ఏసురత్నం, చెంచారావు, ప్రసన్న, సుమతి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిహారం, కారుణ్య కోటా కింద ఉద్యోగాలు పొందిన ఇద్దరికి సోమవారం గ్రీవెన్స్ హాలులో ఆయన నియామకపత్రాలను అందించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులో బాధితుడు మాగులూరి రవికుమార్ చనిపోవడంతో అతని భార్య సలోమికి, రోడ్లు భవనాల శాఖలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న గురవయ్య చనిపోవడంతో ఆయన కుమారుడు భార్గవ్‌కు ఉద్యోగాలు లభించాయి. విధుల నిర్వహణలో నైపుణ్యం పెంచుకొని ఉన్నత స్థానాలకు ఎదిగేలా పనిచేయాలని వీరికి కలెక్టర్ సూచించారు.
కొత్తపట్నం: మండలంలోని పాదర్తి తీర ప్రాంతానికి సోమవారం ఉదయం మృతదేహం కొట్టుకువచ్చింది. మృతునికి 45 ఏళ్ల వయసుంటుందని, బులుగు చొక్కా, నల్లని డ్రాయర్ ధరించి ఉన్నాడు. మత్స్యకారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వేముల సుధాకర్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్ మార్చురీకి తరలించారు.
26న రాజ్యాంగ దినోత్సవం


