దొడ్డంపల్లెలో చోరీ
● 20 తులాల బంగారు ఆభరణాలు, వెండి అపహరణ
గిద్దలూరు రూరల్: మండలంలోని దొడ్డంపల్లెలో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పల్లా నవీన్‌కుమార్‌రెడ్డి చైన్నెలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడి తండ్రి రమణారెడ్డి ముంబైలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో ఉన్న ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటారు. ఈ క్రమంలో దుండగులు ఆదివారం రాత్రి వారి ఇంటి ముందు కారులో రెక్కి నిర్వహించినట్లు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇంట్లో ఎవ్వరూ లేరని తెలుసుకొని అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి 20 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించారు. గ్రామస్తుల సమాచారంతో స్వగ్రామానికి చేరుకున్న నవీన్‌కుమార్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కె.సురేష్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
● తగలబడిన కిరాణా, దుస్తుల దుకాణాలు ● రూ.10 లక్షల మేర ఆస్తినష్టం
పీసీపల్లి: మండల పరిధిలోని గుంటుపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన గాదంశెట్టి సాయికృష్ణ ఒక పక్క కిరాణా దుకాణం, మరో పక్క దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు కేకలు వేశారు. దీంతో ఇంట్లో నుంచి అందరూ బయటకు రావడంతో ఎటువంటి ప్రాణహానీ జరగలేదు. మంటలు ఒక్కసారిగా వ్యాపించి రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో కనిగిరి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రూ.10 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లింది.
మార్కాపురం: గూడ్స్ రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మార్కాపురం, తర్లుపాడు మధ్యలోని 144వ స్టోన్‌వద్ద సోమవారం ఉదయం జరిగింది. రైల్వే ఎస్సై కె. వెంగళరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు వైపు నుంచి నంద్యాలకు వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తెలిపారు. మృతుడు త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామానికి చెందిన కొదమల కృపాల్ (50)గా గుర్తించారు. వ్యక్తిగత కారణాలతో మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.


