పోలీసు స్పందనకు 63 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు పోలీసు అధికారులను కలిసి వారి సమస్యలు విన్నవించారు. రాత పూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసు అధికారులు సమస్య పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా విచారణ జరిపి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పోలీసు గ్రీవెన్స్‌లో ఎక్కువగా భూ వివాదాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, కుటుంబ కలహాలపై ఫిర్యాదులు అందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ వీవీ రమణ కుమార్, కనిగిరి సీఐ ఖాజావలి, యర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్‌రావు పాల్గొన్నారు.


