సమగ్ర శిక్ష ఏపీసీగా అనీల్‌ కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

సమగ్ర శిక్ష ఏపీసీగా అనీల్‌ కుమార్‌

Nov 25 2025 5:50 PM | Updated on Nov 25 2025 5:50 PM

సమగ్ర

సమగ్ర శిక్ష ఏపీసీగా అనీల్‌ కుమార్‌

సమగ్ర శిక్ష ఏపీసీగా అనీల్‌ కుమార్‌ ఎస్సీలపై దాడి చేస్తే అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ● రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ జవహర్‌ ముగ్గురు ఏఎస్‌ఐలకు ఎస్సైలుగా పదోన్నతులు పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలి ● ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు చిన్నపురెడ్డి కిరణ్‌ కుమార్‌ రెడ్డి

ఒంగోలు సబర్బన్‌: జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీగా డి.అనీల్‌ కుమార్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు తీసుకున్న అనంతరం కలెక్టర్‌ పీ.రాజాబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ చాంబర్‌లో కలిసిన ఆయన కలెక్టర్‌కు మొక్కను బహూకరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఏపీసీతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్‌ కుమార్‌ ఉన్నారు.

ఒంగోలు వన్‌టౌన్‌: రాష్ట్రంలో ఎక్కడైనా ఎస్సీలపై దాడి జరిగితే వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ అన్నారు. చీమకుర్తి మండలం బండ్లమూడిలో అగ్రవర్ణాల దాడిలో గాయపడిన దళితులను పరామర్శించడానికి సోమవారం జిల్లాకు వచ్చిన ఆయన ఒంగోలులోని ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. బండ్లమూడిలో ఎస్సీలపై జరిగిన దాడిలో బాధితులకు పూర్తి స్ధాయిలో న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాధితులు అవమానించబడిన చోటే గౌరవంగా బతికేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు చెప్పారు. బండ్లమూడిలో రెండు బల్లల విధానం ఇప్పటికీ అమలవుతోందన్నారు. పెద్ద బల్ల, చిన్న బల్ల అనే విధానాన్ని తీసివేయాలని ఆధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అవసరమైతే విచారణ అధికారిని కూడా మారుస్తామన్నారు. రాష్ట్రంలో అట్రాసిటీ జరిగితే అక్కడ అధికార యంత్రాంగంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, బాధితులకు అండగా ఉంటామన్నారు. బండ్లమూడిలో బాధితులపై నమోదు చేసిన కేసులను తీసివేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఒంగోలులో జిల్లాకు చెందిన దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు చైర్మన్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.

ఒంగోలు టౌన్‌: ముగ్గురు ఏఎస్‌ఐలకు పదోన్నతులు కల్పిస్తూ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 1992 బ్యాచ్‌ ఏఎస్సైలు సీహెచ్‌.రాము (టంగుటూరు), కోటేశ్వరరావు (డీసీఆర్బీ, ఒంగోలు), మాల్యాద్రి రెడ్డి (కందుకూరు టౌన్‌)లకు ఎస్సైలుగా పదోన్నతులు కల్పించారు. దీంతో సోమవారం ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేశారు.

ఒంగోలు సబర్బన్‌: పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒంగోలు పట్టణ, తాలూకా కార్యనిర్వాహక కమిటీ సమావేశం సోమవారం ఒంగోలులోని సంఘ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ పీఆర్‌సీ కమిషన్‌ను నియమించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయటం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు కూడా తీర్చకుండా ప్రభుత్వం ఉండటం సరికాదన్నారు. సంఘం సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, డైరీ కం హ్యాండ్‌ బుక్‌ 2026 కు సంబంధించి ప్రకటనలను వెంటనే రాష్ట్ర సంఘానికి అందజేయాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి వరకుమార్‌, ట్రెజరర్‌ రంగారెడ్డి, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, తాలూకా అధ్యక్షుడు సురేష్‌ బాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు రజిత, నాయకులు మానస, చంద్రశేఖర్‌, శ్రీనివాసులు, ఏసురత్నం, చెంచారావు, ప్రసన్న, సుమతి, సందీప్‌ పాల్గొన్నారు.

సమగ్ర శిక్ష ఏపీసీగా అనీల్‌ కుమార్‌1
1/2

సమగ్ర శిక్ష ఏపీసీగా అనీల్‌ కుమార్‌

సమగ్ర శిక్ష ఏపీసీగా అనీల్‌ కుమార్‌2
2/2

సమగ్ర శిక్ష ఏపీసీగా అనీల్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement