ఒంగోలు సిటీ: విద్యార్థులను ఆంగ్లభాషలో ప్రావీణ్యులుగా, గణితంలో ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు ‘సాక్షి మీడియా గ్రూప్’ ఆదివారం నిర్వహించిన స్పెల్ బీ క్వార్టర్ ఫైనల్స్, మ్యాథ్ బీ సెమీ ఫైనల్స్ పరీక్షలకు విశేష స్పందన లభించింది. ప్రజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్స్‌వేఫీస్, అసోసియేట్ స్పాన్సర్‌గా రాజమహేంద్రవరం ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరించాయి. ఈ పోటీలను ఒంగోలులోని అపెక్స్ స్కూల్లో కరస్పాండెంట్ శివకోటిరెడ్డి, ఆంధ్రా స్కూల్లో కరస్పాండెంట్ బొమ్మల శ్రీనివాసరావు, సాక్షి అడ్వర్టయిజ్‌మెంట్ అసిస్టెంట్ మేనేజరు జ్ఞానేశ్వరశర్మ పర్యవేక్షించారు. సాక్షి స్పెల్ బీలో కేటగిరి–2, కేటగిరి–3, కేటగిరి–4 కింద, మ్యాథ్ బీలో కేట గిరి–3, కేటగిరి–4 కింద విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. సాక్షి స్పెల్ బీ, మ్యాథ్ బీ వంటి పరీక్షలు విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని, వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి కాంపిటేటివ్ పరీక్షలకు ఎంతగానో దోహదపడతాయని తల్లిదండ్రులు తెలిపారు. స్పెల్‌బీ, మ్యాథ్‌బీ నిర్వహించిన సాక్షి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్సాహంగా ‘సాక్షి’ స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలు
ఉత్సాహంగా ‘సాక్షి’ స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలు
ఉత్సాహంగా ‘సాక్షి’ స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలు


