గ్రామీణ పేదల జీవనాన్ని దెబ్బతీయొద్దు
ఏ వ్యవస్థలోనైనా లోపాలు సహజంగా ఉంటాయి. అంతమాత్రాన వాటిని రద్దు చేయడం సహేతుకమనిపించదు. ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటిని తగలబెట్టినట్లుంది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. ఉపాధి హామీలో అదనంగా జాబ్ కార్డులుంటే తొలగించడంలో తప్పులేదు. కానీ ఆ సాకుతో ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరులను, దళితులు, గిరిజనులు, వెనకబడిన తరగతులు, మైనార్టీల జాబ్ కార్డులను తొలగించడం అమానుషం. కనీసం వారికి తెలియజేయాల్సిన బాధ్యతను మరిచి ఎలాంటి సమాచారం ఇవ్వకండానే జాబ్ కార్డులు తొలగించడం మంచిపద్ధతి కాదు. రాజకీయ కారణాలతో గ్రామీణ ప్రజల జీవనాన్ని దెబ్బతీసే చర్యలను ఖండిస్తున్నాను.
– కంకణాల ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
మా కుటుంబంలో నలుగురివి తీసేశారు
మా కుటుంబంలోని నలుగురువి జాబ్ కార్డు నుంచి తొలగించారు. ఈ–కేవైసీ పేరుతో నిరుపేద కుటుంబాలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఇలా నిర్దాక్షిణంగా పేర్లు తొలగించటం దుర్మార్గం. మా కుటుంబంలోనే ఎస్సీ కాలనీలో చాలా మంది పేదలవి జాబ్ కార్డులు రద్దు చేశారు. ప్రభుత్వం స్పందించి మళ్లీ తొలగించిన వారికి జాబ్ కార్డులు ఇవ్వాలి.
– బొజ్జా బాబు, పెదారికట్ల
మొన్నటి వరకు పనికి వెళ్లాను..
మొన్నటి వరకు ఉపాధి పనికి వెళ్లాను. ఇటీవల ఈ–కేవైసీ కూడా చేశారు. అయినా నా పేరు తొలగించారు. మా లాంటి పేదలకు ఉపాధి పథకం కొంతమేర ఉపయోగపడుతుంది. పనులు లేని సమయంలో మాకు ఉపాధి పనులే దిక్కు. జాబ్ కార్డు లేకపోతే మా పరిస్థితి ఏంటో అర్థ కావడంలేదు. అధికారులు మాలాంటి వారికి జాబ్ కార్డులు ఇచ్చి పనులకు వెళ్లేలా చూడాలి.
– బొజ్జా ఒక్కెమ్మ, ఎస్సీ కాలనీ, పెదారికట్ల
గ్రామీణ పేదల జీవనాన్ని దెబ్బతీయొద్దు
గ్రామీణ పేదల జీవనాన్ని దెబ్బతీయొద్దు


