‘బి’ సర్టిఫికెట్...
ఇంటర్ మొదటి సంవత్సరంలో బీ సర్టిఫికెట్ కోసం ఎన్‌సీసీలో చేరవచ్చు. రెండేళ్ల శిక్షణ తరగతుల అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణులైతే సర్టిఫికెట్ ఇస్తారు. మొదటి సంవత్సరంలో 31 రోజులు, రెండో సంవత్సరంలో 34 రోజులు శిక్షణలో పాల్గొనాలి. ఇంటర్ రెండో ఏడాదిలో నిర్వహించే శిబిరంలో సైతం పాల్గొనాలి. బీ లేకుండా సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేరు. బీ సర్టిఫికెట్‌లో కవాతు, ఆయుధ పరీక్ష, రాత పరీక్ష ఉంటాయి. ఆయుధ పరీక్షలో 0.22 రైఫిల్‌లోని పార్టులు మొత్తం విప్పి తిరిగి బిగించడం నేర్పిస్తారు. రాత పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది.
‘సి’ సర్టిఫికెట్...
డిగ్రీ మొదటి సంవత్సరంలో సీ సర్టిఫికెట్ కోసం ఎన్‌సీసీలో చేరవచ్చు. చివరి సంవత్సరంలో ‘సి’ సర్టిఫికెట్ పరీక్ష ఉంటుంది. ఇన్‌స్టిట్యూషనల్ శిక్షణ తీసుకోవాలి. జాతీయ సమగ్రత శిబిరంలో పాల్గొనడానికి ఈ శిక్షణ చక్కని అవకాశం. ఇందులో పాల్గొంటే అదనంగా 25 మార్కులు కలుపుతారు. ‘సి’ సర్టిఫికెట్ వస్తే విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. కేంద్ర బలగాల్లో చేరేందుకు రిజర్వేషన్ ఉంటుంది. కేంద్ర పోలీస్ సంస్థలైన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీలో అధికారిగాగానీ, కానిస్టేబుల్‌గాగానీ చేరేందుకు ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది.
‘బి’ సర్టిఫికెట్...


