టిప్పర్ ఢీకొని వృద్ధుడు మృతి
సింగరాయకొండ: టిప్పర్ ఢీకొని వృద్ధుడు మృతిచెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై సింగరాయకొండలోని లారీ యూనియన్ ఆఫీసు సమీపంలో ఐస్ ఫ్యాక్టరీ వద్ద జరిగింది. సైకిల్‌పై వెళ్తున్న ఆయుర్వేద వైద్యుడు సానికొమ్ము మాణిక్యాలరావు (70)ను కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొని శరీరంపై నుంచి వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందాడు. టంగుటూరు మండలం పోతుల చెంచయ్య కాలనీకి చెందిన మాణిక్యాలరావు ఆయుర్వేద వైద్యుడిగా పనిచేస్తూ వైద్యం చేసేందుకు ఎంత దూరమైనా సైకిల్‌పై వెళ్లి వస్తుంటాడు. ఉలవపాడు వెళ్లేందుకు సైకిల్‌పై బయలుదేరగా టిప్పర్ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. మాణిక్యాలరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇతనికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బీ మహేంద్ర తెలిపారు. టిప్పర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు.
సానికొమ్ము మాణిక్యాలరావు (ఫైల్)
టిప్పర్ ఢీకొని వృద్ధుడు మృతి


