ఇన్‌చార్జి ఎస్పీగా ఉమామహేశ్వర్
ఒంగోలు టౌన్: జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు వ్యక్తిగత పనులపై సెలవు మీద వెళ్లారు. నేటి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జి ఎస్పీగా బాపట్ల ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ను నియమిస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి బాపట్ల ఎస్పీ ఇన్‌చార్జిగా విధులు నిర్వహించనున్నారు.
దొనకొండ: 69వ స్కూల్ గేమ్స్ అండర్ 17 జిల్లా సెలక్షన్స్ ఒంగోలు నవోదయ పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్‌కు కేజీబీవీ విద్యార్థులు ఎంపికయ్యారు. అండర్ 17 జిల్లా సెలక్షన్‌లో కె.నాగమణి 9వ తరగతి 100 మీ పరుగు పందెంలో మొదటి స్థానం, అలాగే లాంగ్ జంప్‌లో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో 10వ తరగతి జోత్స్న నిలిచింది. 800 మీ.తో రెండో స్థానంలో 9వ తరగతి సిరి చందన నిలిచారు. 4 x 100 రిలే పరుగు పందెంలో నాగమణి, జోత్స్న, సిరిచందన, లక్ష్మీ ప్రణతి విజయం సాధించారు. ఈ నలుగురు 24, 25 తేదీల్లో పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్‌లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయురాలు గీతాకళ్యాణి తెలిపారు. వారిని ప్రత్యేకాధికారి జి.మమత, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.
ఒంగోలు సబర్బన్: స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి, నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి ‘ధార్తీ మాతా బచావో అభియాన్’ కార్యక్రమం కింద ‘ధార్తీ మాతా బచావో నిగ్రాణి సమితి’ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పీ.రాజాబాబు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్లో శుక్రవారం అధికారులతో సమావేశమయ్యారు. ‘ధార్తీ మాతా బచావో అభియాన్’ విధివిధానాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి, నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. నిర్దేశించిన విధంగా గ్రామ, సబ్ డివిజన్, జిల్లా స్థాయిలో ధార్తీ మాతా బచావో నిగ్రాణి సమితులను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి సుభాషిణి, మార్క్‌ఫెడ్ అధికారి హరికృష్ణ, జిల్లా సహకార శాఖాధికారి శ్రీలక్ష్మి, ఫెర్టిలైజర్స్ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు సబర్బన్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ అన్నారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్, ఎల్‌ఎల్‌ఆర్ మంజూరు కోసం శుక్రవారం ఒంగోలులోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్ లైసెన్స్‌ల మంజూరులో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గ్రీవెన్స్‌లో పలువురు దివ్యాంగులు తెలిపారని, దీనిపై స్పందించి ప్రత్యేకంగా ఈ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. 59 మంది తమ వివరాలు నమోదు చేసుకున్నట్లు చెప్పారరు. ఇందులో రవాణా శాఖ సిబ్బంది ఆన్‌లైన్ ద్వారా ఎల్‌ఎల్‌ఆర్, లైసెన్స్ స్లాట్‌లను బుక్ చేస్తారన్నారు. ఈ సౌకర్యాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువార్త, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జి ఎస్పీగా ఉమామహేశ్వర్
ఇన్‌చార్జి ఎస్పీగా ఉమామహేశ్వర్


