జాతీయస్థాయి క్యారమ్స్ పోటీలకు మస్తాన్‌వలి
దర్శి: జాతీయ స్థాయి ఆటల పోటీలకు బసిరెడ్డిపల్లె ఎంపీపీఎస్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న షేక్ మస్తాన్‌వలి ఎంపికయ్యారు. సివిల్ సర్వీసెస్ ఆటలు పోటీల్లో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడలో గురువారం నిర్వహించిన క్యారమ్స్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన మస్తాన్‌వలి గుజరాత్‌లో జరగబోవు జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓలు కే మాలకొండయ్య, బీ రమాదేవి, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వాకా జనార్దన్ రెడ్డి, షేక్ ఖాదర్ మస్తాన్, యూటీఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి దనిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు ప్రసాద రెడ్డి, రామిరెడ్డి, ముక్కాలరెడ్డి, మారుతీ కిరణ్ రెడ్డి, నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
జాతీయస్థాయిలో యోగా పోటీలకు రమణయ్య
పీసీపల్లి: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ యోగా పోటీల్లో భాగంగా శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులకు విజయవాడలో గాంధీజీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పీసీపల్లి మండలం వెంగళాయపల్లి పాఠశాలకు చెందిన స్వర్ణ వెంకట రమణయ్య ఉత్తమ ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రమణయ్యను జిల్లా స్పోర్ట్స్ అధికారి రాజేశ్వరి, మండల విద్యాశాఖ అధికారులు ఆర్ శ్రీనివాసులు, సంజీవ్ అభినందించారు.


