నీళ్లివ్వండి మహాప్రభో..!
మార్కాపురం: మండలంలోని బిరుదులనరవ గ్రామంలో తాగునీటి సమస్య తీర్చాలని శుక్రవారం గ్రామ మహిళలు, ప్రజలు బిందెలు, డ్రమ్ములతో ఆందోళన చేపట్టారు. ఎస్సీకాలనీలో వారంరోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని, అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న బోర్లలో సైతం నీరు రాకపోవడంతో పొలాల్లోకి వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. అధికారులు ఇప్పటికై నా స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామస్థుల ధర్నాతో తాత్కాలికంగా శుక్రవారం సాయంత్రం ట్యాంకరు ద్వారా నీటి సరఫరా చేశారు.


