బాలికలతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన వాస్తవమే
బాలికలకు అండగా
న్యాయసేవాధికార సంస్థ
కురిచేడు:
బాలికలతో ఉపాధ్యాయుడు పి.సురేష్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విచారణలో నిర్ధారణ అయిందని ఎంఈఓ ఆర్.వస్త్రాంనాయక్ వెల్లడించారు. శుక్రవారం ఆయన ఎంఈఓ–2 సీహెచ్ సుబ్బారావుతో కలిసి కురిచేడు మండలంలోని కల్లూరు గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పాఠశాలలో విచారణ చేపట్టారు. బాధిత బాలికలతోపాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. రెండో తరగతి విద్యార్థినులతో సైతం అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఆయన తిన్న కంచాలు కడిగించేవాడని, పాఠశాలలో జరిగిన విషయాలు ఇంటి వద్ద చెబితే కొడతానని తమ పిల్లలను బెదిరించాడని తల్లిదండ్రులు వివరించారు. ఇదిలా ఉండగా తమ కుమారుడిని తీవ్రంగా కొట్టడం వల్ల శరీరంపై వాతలు పడ్డాయని, తలకు కూడా దెబ్బ తగిలిందని తల్లిదండ్రులు ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు స్వీకరించిన ఎంఈఓ జిల్లా విద్యాశాఖ ఉన్నతాదికారులకు నివేదిక పంపనున్నట్లు తెలిపారు. కాగా సదరు ఉపాధ్యాయుడు గతంలో కూడా అసభ్య ప్రవర్తనతో ఒకసారి, విద్యార్థిని కొట్టి మరోసారి సస్పెండ్ అయినట్లు సమాచారం.
వరుస ఘటనలతో తల్లిదండ్రుల బెంబేలు
మండలంలోని పాఠశాలల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు విద్యా వ్యవస్థ తీరుకు అద్దం పడుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో పడమరనాయుడుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థినితో అక్రమ సంబంధం నెరిపి సస్పెండయ్యాడు. మరో ఉపాధ్యాయుడు వీవై కాలనీలో వంట మనిషితో గొడవపడి విధులకు దూరమయ్యాడు. తాజాగా కల్లూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించి విచారణ ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో పాఠశాలలకు తమ పిల్లలను పంపాలంటేనే తల్లిదండ్రులు పది సార్లు ఆలోచించుకుంటున్నారు.
రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ నుంచి జిల్లాకు వచ్చిన లేఖ
ఎంఈఓ వస్త్రాంనాయక్ వెల్లడి
కురిచేడు మండలంలోని కల్లూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినులతో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించడంపై ‘సాక్షి’ ప్రధాన సంచికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ స్పందించింది. బాధితులకు న్యాయం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒంగోలు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా జడ్జి బీఎస్‌వీ హిమబిందును కల్లూరు పాఠశాలలో విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం చేయాలని సూచించింది.
బాలికలతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన వాస్తవమే


