ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాన్ని ఆపాలి
చీమకుర్తి: ప్రభుత్వ స్థలంలో టీడీపీ నాయకుడు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని ఆపాలని వైఎస్సార్‌సీపీ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి శుక్రవారం చీమకుర్తిలోని నెహ్రూ నగర్‌లో అక్రమ నిర్మాణాన్ని పరిశీలించారు. చీమకుర్తిలో టీడీపీకి చెందిన ఒక నాయకుడు మెప్మా క్యాంటీన్ పేరుతో ప్రభుత్వ స్థలాన్ని స్వాహా చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. భూ కబ్జా బాగోతాన్ని ఏకంగా అధికారుల అండతోనే నడిపిస్తున్నాడని ఆరోపించారు. తక్షణమే అక్రమ నిర్మాణాన్ని ఆపకపోతే వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున దృష్టికి తీసుకెళ్లి, ప్రజాసంఘాలతో కలిసి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భూ కబ్జాపై కమిషనర్ స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గోపురపు చంద్ర, దుడ్డు మార్కు, తెల్లమేకల యల్లయ్య, బత్తుల మల్లికార్జున, స్థానికులు పాల్గొన్నారు.


