దుకాణాలు లూటీ
కంభం, దర్శిలో
రెచ్చిపోయిన దొంగలు
దర్శిలో వరుస చోరీలు
కంభం:
కంభం పట్టణంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు చేతివాటం చూపారు. బస్టాండ్ పక్కనే ఉన్న రెండు ఎలక్ట్రికల్ షాపుల షట్టర్లు పగలగొట్టి లోపలికి ప్రవేశించి నగదు అపహరించారు. మరో దుకాణం షట్టర్ పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. బస్టాండ్ సమీపంలో మల్లికార్జున అనే వ్యక్తి నిర్వహిస్తున్న సాయిబాలాజీ ట్రేడర్స్ ఎలక్ట్రికల్ షాపు షట్టర్ పగలగొట్టిన దొంగ కౌంటర్‌లో ఉంచిన సుమారు రూ.4 వేల నగదు చోరీ చేశాడు. పక్కనే ఉన్న నారాయణ ఏజెన్సీస్ దుకాణం షట్టర్ పగలగొట్టి నగదు కోసం కౌంటర్ మొత్తం వెతికాడు. ఓ వ్యక్తి దుప్పటి చుట్టుకొని లోపలికి వెళ్లి వస్తున్న దృశ్యాలు దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ రెండు దుకాణాల మధ్యలో ఉన్న మరో షాపు షట్టర్ పగలగొట్టేందుకు విఫలయత్నం చేశాడు. చోరీ జరిగిన దుకాణాలను బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి పరిశీలించి యజమానులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మార్కాపురం నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.
కంభం బస్టాండ్ వద్ద 2 షాపుల షట్టర్లు పగలగొట్టి చోరీ
మరో దుకాణంలో చోరీకి విఫలయత్నం
ఎల్‌కోట గ్రామంలో 3 తులాల బంగారు సరుడు దొంగిలించిన యువకుడు
పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు
దర్శిలో బుధవారం అర్ధరాత్రి 4 దుకాణాల్లో చోరీ
బెంబేలెత్తుతున్న చిరు వ్యాపారులు
దర్శి: దర్శి పట్టణంలో బుధవారం అర్ధరాత్రి వరుస దొంగతనాలు చోటుచేసుకున్నాయి. చిల్లర దుకాణాలను, నివాసాల ముందు పార్క్ చేసిన బైకులను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. స్థానిక అద్దంకి రోడ్డులో పేరమ్మ అనే మహిళ నిర్వహిస్తున్న దుకాణం తాళాన్ని పగలగొట్టి సరుకులు, రూ.6 వేలకు పైగా నగదు అపహరించారు. అలాగే వసంత్ అనే వ్యక్తికి చెందిన దుకాణంలో నగదు, ఇతర సామగ్రి, హైమవతికి చెందిన దుకాణంలో కొంత నగదు చోరీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురు మూలె కొండారెడ్డి అనే వ్యక్తి పార్క్ చేసి ఉంచిన హోండా షైన్ బైక్‌ను దొంగలు అపహరించారు. మొత్తం రూ.లక్షకు పైగా విలువ చేసే సామగ్రి పోయినట్లు సమాచారం.
దుకాణాలు లూటీ
దుకాణాలు లూటీ
దుకాణాలు లూటీ
దుకాణాలు లూటీ
దుకాణాలు లూటీ


