మెడికల్ కాలేజీలు కట్టలేవా చంద్రబాబూ?
ఒంగోలు టౌన్: ప్రపంచ స్థాయిలో అమరావతి రాజధాని నిర్మిస్తామంటూ గొప్పలు చెబుతున్న సీఎం చంద్రబాబుకు మెడికల్ కాలేజీలు నిర్మించడం చేతకాదా అని ప్రగతిశీల విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ ప్రశ్నించారు. వైద్య, విద్యారంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవాలని రాజ్యాంగంలో రాసుకున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఏర్పాటుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు వచ్చాయని, వాటిలో 5 కాలేజీల నిర్మాణం పూర్తి చేసి తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మిగిలిన కాలేజీలను పూర్తిచేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. నారా లోకేష్ యువగళంలో ఇచ్చిన హామీ మేరకు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించి నిర్వాహించాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 107, 108, 590ను రద్దు చేసి అర్హులైన విద్యార్థులు వైద్య విద్య చదివే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం దిగిరాకుంటే విద్యార్థి సంఘాలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అమరావతి, విశాఖపట్నంలో ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైద్య విద్యను అంబానీ, అదానీలకు అప్పగించేందుకే చంద్రబాబు ప్రభుత్వం తహతహలాడుతోందని ఆరోపించారు. ప్రైవేటీకరణపై మక్కువ పెంచుకున్న కూటమి పాలకులకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సీహెచ్ సిసింద్రి బాబు, వి.కోటి, శాంసన్, చంద్రశేఖర్, సచిన్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గిద్దలూరు రూరల్: పట్టణంలో మద్యం మత్తులో వాహనం నడిపిన ఓ వ్యక్తికి గిద్దలూరు అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి భరత్‌చంద్ర 100 రోజుల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధించినట్లు సీఐ కె.సురేష్ గురువారం తెలిపారు. పట్టణంలో గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి మద్యం మత్తులో పట్టుబడ్డాడని, నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జడ్జి శిక్ష విధించారని వివరించారు.
మరి అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఎలా?
వైద్య, విద్య రంగాలు ప్రభుత్వమే నిర్వహించాలని
రాజ్యాంగంలో ఉంది కదా?
కలెక్టరేట్ ఎదుట ధర్నాలో నిప్పులు చెరిగిన
పీడీఎస్‌యూ నాయకులు
పీపీపీ జీఓలు రద్దు చేయకుంటే విద్యార్థుల ఆగ్రహానికి
గురికాక తప్పదని హెచ్చరిక


