న్యాయవాది ఇంటిపై టీడీపీ నేతల దౌర్జన్యం
దర్శి: అధికారమే అండగా టీడీపీ నేతలు రోజురోజుకూ బరితెగిస్తున్నారు. దర్శిలో న్యాయవాది మారం రాజశేఖరరెడ్డి ఇంటిపై గురువారం టీడీపీ మూకలు దౌర్జన్యానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. బాధితుడి కథనం మేరకు.. రాజశేఖరరెడ్డి తన కుమార్తె వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదే అదనుగా భావించిన టీడీపీ నాయకులు డీఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్న రాజశేఖరరెడ్డి స్థలాన్ని ఆక్రమించేందుకు స్కెచ్ వేశారు. ఇంటి వద్దకు చేరుకున్న టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తిస్తుండగా.. సామరస్యంగా మాట్లాడాలని, కుమార్తె వివాహ పనుల్లో ఉన్నానని న్యాయవాది సూచించారు. వివాహమైన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని చెబుతున్నా టీడీపీ నేతలు అదేమీ పట్టించుకోకుండా ఇప్పుడే చర్చించాలంటూ పట్టుబట్టారు. అందుకు న్యాయవాది ససేమిరీ అనడంతో గొడవకు దిగిన టీడీపీ నేతలు.. శ్రీనీ కుమార్తె వివాహం ఎలా చేస్తావో చూస్తాంశ్రీ అంటూ బెదిరించారు. ఆ తరువాత పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని న్యాయవాదిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేలా పోలీసు అధికారులతో టీడీపీ నేతలు మంతనాలు సాగించారన్న చర్చ స్థానికంగా జోరుగా నడుస్తోంది. టీడీపీ ముఖ్యనేత ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు నడుచుకుంటున్నారని, తనపై కేసులు బనాయించేందుకు కుట్ర చేస్తున్నారని న్యాయవాది రాజశేఖరరెడ్డి ఆరోపించారు.
● సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
● ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజుకు వీఏఏల విజ్ఞప్తి
మార్కాపురం: గ్రామ రైతు సేవా కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వ్యవసాయ సహాయకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లుకు వీఏఏల అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు జక్కి గణేష్ సాగర్ విజ్ఞప్తి చేశారు. గురువారం బొప్పరాజు తన స్వగ్రామమైన మీర్జపేటకు రాగా పలువురు వీఏఏలు కలిసి సమస్యలు వివరించారు. బదిలీల పేరుతో కొందరు ఉద్యోగులను జిల్లాలు దాటించారని, సుమారు 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్‌ఎస్‌కేలకు బదిలీ చేయడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఏ బకాయిలు, పీఆర్‌సీ అమలు, ఇతర సమస్యలపై జేఏసీ సమావేశంలో చర్చిస్తామని బొప్పరాజు హామీ ఇచ్చారని సాగర్ తెలిపారు.
కుమార్తె వివాహం ఎలా చేస్తావో చూస్తామంటూ బెదిరింపులు
అట్రాసిటీ కేసు బనాయించేందుకు పోలీసులపై తీవ్ర ఒత్తిడి
స్థలాన్ని కబ్జా చేసేందుకు స్కెచ్ వేశారని న్యాయవాది ఆరోపణ


