ఎల్‌కోటలో చోరీ
కంభం మండలంలోని ఎల్‌కోట గ్రామంలో ఓ గృహంలో 3 తులాల బంగారు సరుడును ఓ యువకుడు అపహరించాడు. అప్రమత్తమైన స్థానికులు ఆ యువకుడిని చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలు.. శివకుమారి అనే మహిళ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన సుబానీ అనే యువకుడు ఇంట్లోకి ప్రవేశించి బంగారు సరుడు, రూ.300 నగదును అపహరించి పారిపోయేందుకు యత్నించాడు. శివకుమారి కేకలు వేయడంతో స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని బంగారు సరుడును స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన గృహాన్ని గురువారం ఉదయం బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి పరిశీలించారు. దొంగతనానికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా ఆ యువకుడు గతంలో కూడా పలుమార్లు చోరీలకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.


