పత్తి కొనుగోళ్లలో నిబంధనాలు
ముందుకురాని రైతులు.. వెనక్కి తగ్గిన బయ్యర్లు.. బోసిపోయిన పత్తి కొనుగోలు కేంద్రం
మార్కాపురం: సీసీఐ ఆధ్వర్యంలో మార్కాపురం మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం గురువారం అటు బయ్యర్లు.. ఇటు రైతులు లేక బోసిపోయింది. ప్రధానంగా పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం విధించిన నిబంధనలు రైతులకు అడ్డంకిగా మారాయి. దీంతో రైతులు తాము పండించిన పత్తిని యార్డుకు తీసుకురాలకే గ్రామాల్లో నే వ్యాపారులు చెప్పిన ధరకే విక్రయిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..ఈ నెల 17న మార్కాపురం మార్కెట్‌యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జేసీ, ఎమ్మెల్యే రఅట్టహాసంగా పారంభించారు. రెండు రోజుల పాటు పత్తి కొనుగోళ్లు సాగాయి. కనీస మద్దతు ధర క్వింటా రూ.8110 ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆశపడ్డారు. అయితే సీసీఐ విధించిన నిబంధనలు రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తేమశాతం 12 వరకు మాత్రమే ఉండాలని, 8 శాతం నుంచి పెరిగిన ప్రతి ఒక్క శాతం చొపున మద్దతు ధర తగ్గిస్తామని తెలిపారు. బన్నీ లేదా బ్రహ్మ రకం పత్తికి పింజ పొడవు 29.50 నుంచి 30.50 ఎంఎం వరకూ, మైక్రోనైర్ 3.50 నుంచి 4.30 మద్య ఉండి 8 శాతం తేమ ఉంటే క్వింటా రూ.8,110 ప్రకారం కొనుగోలు చేస్తామని, 9 శాతం తేమ ఉంటే రూ.8028.90, 10శాతం తేమ వుంటే రూ.7,947.80, 11 శాతం తేమ ఉంటే రూ.7,866.70, 12శాతం తేమ ఉంటే రూ.7,785.60 చొప్పున క్వింటా పత్తిని కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇదే విధంగా బ్రహ్మ స్పెషల్, ఎంఈసీహెచ్ రకాలకు కూడా ధరను నిర్ణయించారు. దుమ్ము, ధూళి, చెత్తా చెదారం, గుడ్డిపత్తి కాయలు, రంగుమారిన, పురుగుపట్టిన, కౌడిపత్తి, ముడుచుకుపోయిన పత్తి కాయలను వేరుచేసి తెస్తేనే కొనుగోలు చేస్తామనే నిబంధన విధించారు. ఈ పంటలో నమోదు చేసుకున్న రైతులు, కౌలు రైతులు మాత్రమే పత్తి కొనుగోలు కేంద్రానికి రావాలని నిబంధన పెట్టారు. అలా కాని వారు కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకువస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇలా అనేక నిబంధనలు విధించడంతో రైతులు యార్డులోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి రావడం మానేశారు.
వాస్తవ పరిస్థితి ఇదీ...
మోంథా తుఫానుతో పశ్చిమ ప్రకాశంలో సాగుచేసిన పత్తి పూర్తిగా రంగుమారి నల్లగా అయింది. పలుచోట్ల పత్తికాయల్లో దుమ్ముధూళి ఏర్పడింది. రంగుమారి నాణ్యత తగ్గింది. సీసీఐ నిబంధనల ప్రకారం అమ్ముకోలేమని తెలిసి రైతులు గ్రామాల్లోనికి వచ్చిన వ్యాపారులకు క్వింటా రూ.5 వేల నుంచి రూ.5500 మధ్య విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 31,500 ఎకరాల్లో పత్తి సాగుకాగా, ఒక్కపశ్చిమ ప్రకాశంలోనే 15,600 ఎకరాల్లో పత్తి సాగుచేశారు. ఎకరా పత్తి సాగుచేసేందుకు సుమారు రూ.25 నుంచి రూ.30 వేల వరకూ ఖర్చు వచ్చింది. తుఫాను రాకపోయివుంటే ఎకరాకు సుమారు 6 నుంచి 8 క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చేది. తుయోలను తాకిడికి దిగుబడి 3 నుంచి 4 క్వింటాళ్లకు పడిపోయింది. ఇలా పత్తి రైతులు అన్ని విధాలా ఈ ఏడాది నష్టపోయారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం..
సీసీఐ నిబంధనలను సడలించాలని కోరుతూ మా శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపారు. నిబంధనలు సడలిస్తే ఆ ప్రకారం మళ్లీ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం రైతులు పత్తి తెస్తే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు.
– కోటేశ్వరరావు, సెక్రటరీ, మార్కెట్‌కమిటీ, మార్కాపురం


