పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా అజయ్‌బాబు
ఒంగోలు: జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా మొలకలపల్లి అజయ్‌బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలేనికి చెందిన అజయ్‌బాబు గతంలో సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా, ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. మూడేళ్ల పాటు పీపీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయన్ను పలువురు న్యాయవాదులు అభినందించారు.
● కలెక్టర్ పి.రాజాబాబు
ఒంగోలు సబర్బన్: పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి నూతన అక్రేడిటేషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా మీడియా అక్రేడిటేషన్ కమిటీ చైర్మన్ పి. రాజాబాబు తెలిపారు. గతంలో జారీ చేసిన అక్రేడిటేషన్ కార్డుల గడువు ఈ ఏడాది నవంబర్ 30 నాటికి ముగుస్తున్నందున నూతన అక్రిడిటేషన్స్ జారీ ప్రక్రియ చేపట్టామని చెప్పారు. అక్రేడిటేషన్లకు నిబంధనల మేర అర్హత కలిగిన పాత్రికేయుల దరఖాస్తులను ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాన్నారు. మీడియా రిలేషన్స్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాత్రికేయులు సంబంధిత పత్రాల డాక్యుమెంట్లను పెన్‌డ్రైవ్‌లో పొందుపరిచి, జిరాక్స్ కాపీలను కూడా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. నవంబర్ 21వ తేదీ నుంచి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో సూచించిన విధంగా సంబంధిత పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. దినపత్రికలు, వార, మాస పత్రికలకు పీఆర్‌జీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఏబీసీ, ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (మునుపటి రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా) ఎంప్యానెల్డ్ సీఏ సర్టిఫికెట్ కూడా జత చేయాలన్నారు. సంస్థ పాన్‌కార్డ్, రెండేళ్ల ఐటీ రిటర్నులు, పీఆర్‌జీఐకి సమర్పించిన వార్షిక రిటర్న్‌ల తాజా కాపీ సమర్పించాలన్నారు. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ రెగ్యులేషన్ చట్టం 1995 కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (కేబుల్ ఛానెల్‌ల కోసం) ఏపీ ఫైబర్‌నెట్ నుంచి అధికార లేఖ కూడా ఇవ్వాలన్నారు.
ఒంగోలు టౌన్:
సముద్ర తీర భద్రతే ప్రధాన లక్ష్యమని ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. సముద్ర తీర భద్రతను పరిరక్షించడంతో పాటు ఉగ్ర దాడుల సమయంలో భద్రతా వ్యవస్థల ప్రతిస్పందన సామర్థ్యాన్ని అంచనా వేయడమే లక్ష్యంగా గురువారం జిల్లా వ్యాప్తంగా సముద్ర తీరంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్‌డ్రిల్‌లో భాగంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గురు, శుక్రవారాలు రెండు రోజుల పాటు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా మొత్తం 112 మంది పోలీసు సిబ్బంది, అధికారులు, మైరెన్ పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావును నోడల్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా అజయ్‌బాబు


