ఘనంగా మహిళా దినోత్సవం
ఒంగోలు మెట్రో: 58 వ గ్రంథాలయ వారోత్సవాలు, జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం ఎన్నారై గ్లోబల్ ఫోరం, ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి సంయుక్త ఆధ్వర్యంలో సాహితీ, సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలందిస్తున్న ఇద్దరు మహిళామూర్తులను ఘనంగా సన్మానించారు. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి అధ్యక్షురాలు తేళ్ళ అరుణ మాట్లాడుతూ ఉక్కుమహిళగా పేరుపొందిన ఇందిరాగాంధీ దేశ మహిళందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమ్మరావు, సుజాత, మాజీ ఎంపీపీ నాళం నరసమ్మ, నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, డాక్టర్ సుధాకర్, ఇన్చార్జి డిప్యూటీ లైబ్రేరియన్ కాళహస్తి సంపూర్ణ తదితరులు మాట్లాడారు. సన్మాన గ్రహీతలైన లలితా శ్రీనివాస్, మారేపల్లి సూర్యకుమారి తెలుగు భాషకు చేస్తున్న సేవలను ప్రశంసించారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. సత్య సాయి జయంతి మహోత్సవాల సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకలు బుధవారం మంగమూరుడొంక గాంధీనగర్ సత్యసాయి బాబా మందిరంలో మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కనిగిరిరూరల్: రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా కబడ్డీ టీం ఎంపిక పోటీలు బుధవారం మండలంలోని కంచర్లవారిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అండర్ 14, అండర్ 17 కబడ్డీ కాంపిటీషన్స్, సెలక్షన్స్ పీఎం శ్రీ ఎంపిక క్రీడలకు 250 మంది క్రీడాకారులు, సుమారు 70 మంది వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు. హెచ్‌ఎం విజయభాస్కర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు హజరత్‌రెడ్డి, పీ బసవయ్య పర్యవేక్షణలో ఎంతో ఉత్సాహంగా ఎంపిక పోటీలు జరిగాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మాజీ ఎంపీపీ పోతు కొండారెడ్డి, పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ చెక్క వెంకటేశ్వర్లు, శిరీషా, డివిజనల్ కోఆర్డినేటర్లు చిరంజీవిరెడ్డి, భవనం కాశీ విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపికై న అండర్ 14, 17 క్రీడా జట్లు కర్నూల్‌లో 22న జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని జిల్లా తరఫున ఆడతారని పీఈటీలు తెలిపారు.
కొత్తపట్నం: ఉపాధ్యాయుల బోధన నాణ్యతను మెరుగుపరిచేందుకు టచ్ టూల్ ఉపయోగపడుతుందని జిల్లా విద్యాశాఖాదికారి కిరణ్‌కుమార్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల టచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్థికి టచ్ టూల్ ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ప్రతి పాఠశాలలో టచ్ టూల్ అబ్జర్వేషన్ ప్రారంభమవుతున్నట్లు చెప్పారు. అనంతరం అల్లూరు ఉన్నత పాఠశాల, కేజీబీవీని పరిశీలించారు. ఎంఈవో 1, 2 తులసీకుమారి, పద్మావతి, హెచ్‌ఎం బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాకు వచ్చిన ఏపీజేఏసీ స్టేట్ చైర్మన్, ఏపీఆర్‌ఎస్‌ఏ స్టేట్ ప్రెసిడెంట్, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కలెక్టర్ రాజాబాబును కలెక్టర్ చాంబర్‌లో బుధవారం రాత్రి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు పిన్నిక మధుసూదనరావు, కలెక్టరేట్ విభాగం అధ్యక్షుడు సత్యసాయి శ్రీనివాస్, జిల్లా ఈసీ మెంబర్ ప్రశాంత్, ఒంగోలు డివిజన్ సంయుక్త కార్యదర్శి రమణయ్య తదితరులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
ఘనంగా మహిళా దినోత్సవం
ఘనంగా మహిళా దినోత్సవం
ఘనంగా మహిళా దినోత్సవం


