వెంకటేశ్వరరెడ్డి మృతి పార్టీకి తీరని లోటు
యర్రగొండపాలెం: మొగుళ్లపల్లి సర్పంచ్, పార్టీ నాయకుడు కర్నాటి వెంకటేశ్వరరెడ్డి మృతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టమని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం అనుమానాస్పద స్థితిలో వెంకటేశ్వరరెడ్డి మృతి చెందాడన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన హైదరాబాద్ నుంచి హుటాహుటిన వచ్చి ఆయన మృతదేహానికి పూలమాలవేసి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంకటేశ్వరరెడ్డి కుటుంబానికి ఎల్లవేళలా పార్టీ అండదండలు ఉంటాయన్నారు. సంతాపం తెలిపిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, వివిధ విభాగాల నాయకులు కె.ఓబుల్‌రెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, ఎం.బాలగురవయ్య, సయ్యద్ జబీవుల్లా, పి.రాములు నాయక్, పబ్బిశెట్టి శ్రీనివాసులు, సూరె శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్ కుమార్, మహమ్మద్ కాశిం, షేక్.కాశింపీర, షేక్.వలి ఉన్నారు.


