కెనరా బ్యాంక్ వ్యవస్థాపకుడికి ఘన నివాళి
ఒంగోలు వన్‌టౌన్: కెనరా బ్యాంక్ వ్యవస్థాపకుడు అమ్మెంబాళ్ సుబ్బరావు పాయ్ 173వ జయంత్యుత్సవం, బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవాన్ని ఒంగోలు కెనరా బ్యాంక్ రీజినల్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రీజినల్ హెడ్ భీమా రాఘవేందర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఒంగోలులోని ‘బొమ్మరిల్లు’ అనాథాశ్రమం చిన్నారులకు పండ్లు, స్వీట్లు, నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం పిల్లలతో ముచ్చటించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. బ్యాంకు సిబ్బంది శ్రద్ధ, సేవ, నిబద్ధతతో ప్రజలకు మరింత చేరువ కావాలని రీజినల్ హెడ్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెద్దదోర్నాల: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరో యువకుడు స్వామి (25) బుధవారం మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ఈ ప్రమాదంలో కనిగిరికి చెందిన షేక్.ఖాజావలి సంఘటనా స్థలిలోనే మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. గాయపడిన స్వామిని తొలుత శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహించిన అనంతరం జిల్లా కేంద్రంలోని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతున్న స్వామి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.
వేటపాలెం: అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఉప్పగుండూరులోని చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన బెల్లం హరిబాబుకు వేటపాలెం వడ్డె సామాజిక వర్గానికి చెందిన వెంకటేశ్వరమ్మకి మూడేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి రెండేళ్ల పాప ఉంది. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. నెల రోజుల క్రితం బెల్ల హరిబాబు (36), భార్య వెంకటేశ్వరమ్మ రైల్వే స్టేషన్ రోడ్డులో అద్దె ఇంట్లోకి కాపురానికి వచ్చారు. కాగా బుధవారం మధ్యాహ్నం భర్త బెల్లం హరిబాబు ఇంట్లో మృతి చెంది ఉండటంతో కుటుంబ సభ్యులు రిక్షాపై మృతదేహాన్ని వేసుకొని భార్య తరఫు బంధువులు ఉంటున్న సమైఖ్యనగర్‌కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మృతుడి స్వగ్రామైన ఉప్పగుండూరు మృతదేహాన్ని తరలించడాని మినీ లారీలో ఎక్కించారు. విషయం తెలుసుకున్న ఎస్సై జనార్దన్ సమైఖ్యనగర్ వెళ్లి హరిబాబు మృతికి కారణాలను కుటుంబ సభ్యులను అడిగి అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే హరిబాబు భార్య తరఫు బాబాయికి.. మృతుడికి మధ్య జరిగిన ఘర్షణలో తగల రాని చోటు దెబ్బలు తగలడంతో హరి బాబు మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కెనరా బ్యాంక్ వ్యవస్థాపకుడికి ఘన నివాళి
కెనరా బ్యాంక్ వ్యవస్థాపకుడికి ఘన నివాళి


