రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
టంగుటూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన టంగుటూరు టోల్‌ప్లాజా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి తెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని పాల్వంచ నుండి నెల్లూరులోని ఆత్మకూరు వైపు జామాయిల్ మొక్కలు లోడుతో వెళ్తున్న ఆటో టంగుటూరు టోల్ ప్లాజాకు సమీపంలో వచ్చేసరికి ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్ సాయి బండిలో ఇరుక్కుపోయాడు. ప్రమాదం గురించి తెలుసుకున్న టంగుటూరు పోలీసులు, హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శ్రమించి డ్రైవర్ సాయిని బయటకు తీశారు. ప్రమాదంలో సాయి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అదే వాహనంలో ఉన్న అబ్దుల్లాకి చిన్న చిన్న గాయాలు కాగా 108 వాహభంలో ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.


