
ఇంతుల కోర్టులోకే రుణాల బంతి!
పాత బకాయిలు రూ.16 కోట్లు చెల్లించాకే కొత్తవంటూ మెలిక
బేస్తవారిపేట: డ్వాక్రా సంఘాల మహిళలకు సీ్త్ర నిధి రుణాల మంజూరులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పాత బకాయిల వసూలుకు కొత్త రుణాల మంజూరు ప్రక్రియకు ముడి పెట్టడంపై మహిళలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌ఎల్‌పీ–ఎంసీపీ యాప్‌లో వివరాల నమోదులో కొనసాగుతున్న జాప్యం రుణాల మంజూరుకు మరో అడ్డంకిగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థల ఉచ్చులో చిక్కుకోకుండా, వారి జీవనోపాధి కోసం ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం స్రీనిధిని ఏర్పాటు చేసింది. చిన్న హోటళ్లు, కిరాణ దుకాణాలు, కూరగాయలు పండించడం–విక్రయించడం, పేపర్ ప్లేట్ల తయారీ, టైలరింగ్ లాంటి వ్యాపారాలు, వృత్తులు చేసుకునే స్వయం సహాయక సంఘాల మహిళలకు చిన్నచిన్న మొత్తాల్లో సీ్త్రనిధి బ్యాంకు రుణాలు అందిస్తుంది. మూడు నెలల క్రితం వరకు రుణం అవసరమైన డ్వాక్రా మహిళలకు సీ్త్రనిధి యాప్‌లో వివరాలు నమోదు చేసి, బ్యాంకుల నుంచి కావాల్సిన రుణం మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం హెచ్‌ఎల్‌పీ–ఎంసీపీ యాప్(హౌస్‌హోల్డ్ లవులీఉడ్ ప్లాన్–మైక్రో క్రెడిట్ ప్లాన్)లో గ్రూప్ సభ్యులందరి జీవనోపాధి వివరాలు నమోదు చేసి బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ గత మూడు నెలలుగా కొనసాగుతుండటంతో సీ్త్రనిధి రుణాలు మంజూరు చేయకుండా నిలిపివేశారు. జిల్లాలో రూ.16 కోట్ల మేర సీ్త్రనిధి రుణాల బకాయిలు వసూలయ్యే వరకు కొత్త రుణాలు మంజూరు చేసేది లేదని చెబుతుండటంతో అర్హులైన మహిళలు విస్తుపోతున్నారు. సకాలంలో రుణాలు అందకపోవడంతో చిన్న చిన్న అవసరాల కోసం ప్త్రెవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వస్తోందని స్వయం సహాయక సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరు వ్యాపారం చేసుకునే మహిళలు పెట్టుబడి కోసం, అలాగే కళాశాలలు తెరవడంతో తమ పిల్లల ఫీజులు, పుస్తకాల కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ మహిళలకు ఉన్నతి కింద సున్నా వడ్డీకే సీ్త్రనిధి రుణాలు మంజూరు చేస్తారు. ఈ నేపథ్యంలో ఎస్సీ మహిళలు నెలల తరబడి ఎదురుచూపులు చూస్తున్నారు. ఉన్నాతాధికారులు స్పందించి సీ్త్రనిధి రుణాలు మంజూరు చేయాలని పొదుపు సంఘాల మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లాలో డ్వాక్రా సభ్యులు 4,54,628
గ్రామ సమాఖ్య సంఘాలు 1,541
డ్వాక్రా
సంఘాలు 45,062
సీ్త్రనిధి రుణాల కోసం డ్వాక్రా
మహిళల ఎదురుచూపులు
మూడు నెలలుగా రుణం మంజూరు కాక మహిళల అవస్థలు
హెచ్‌ఎల్‌పీ–ఎంసీపీ యాప్‌లో సభ్యుల వివరాల నమోదుతో
మరింత ఆలస్యం
బయోమెట్రిక్
పూర్తయిన గ్రూపులు
34,814
సీ్త్రనిధి రుణాలు తీసుకున్న వారి నుంచి రికవరీ సరిగా లేదు.
గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రూ.1.60 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీఓఏలు సక్రమంగా రుణాలు కట్టించడంలేదు. కొన్ని గ్రామ సంఘాల సభ్యులు రెండు నుంచి మూడేళ్లుగా రుణాలు చెల్లించడం లేదు. ప్రస్తుతం రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
– రాజేశ్వరి, గిద్దలూరు క్లస్టర్ సీ్త్రనిధి మేనేజర్

ఇంతుల కోర్టులోకే రుణాల బంతి!