
మహిళలకు ప్రత్యేక చట్టం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం ఆమె దర్శించుకున్నారు.
సాక్షి, తిరుమల: మహిళలకు ప్రత్యేక చట్టం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం ఆమె దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, 14 ఏళ్లలో ఏనాడు చంద్రబాబు మహిళల రక్షణ కోసం కృషి చేయలేదన్నారు. టీడీపీ నేతలు దొంగ దీక్షలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.
ఉమ్మడి జలాశయాలను ఏకపక్షంగా వాడుకోవడం తగదు..
జల వివాదంపై ఆమె స్పందిస్తూ.. ఉమ్మడి జలాశయాలను ఏకపక్షంగా వాడుకోవడం తెలంగాణకు తగదన్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఏపీకి అన్యాయం చేయొద్దని కోరుతున్నానన్నారు. జల వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నానని.. లేని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుని ఏపీకి న్యాయం చేయాలని రోజా అన్నారు.