TPCC Chief Revanth Reddy Apology To MP Komatireddy Venkat Reddy - Sakshi
Sakshi News home page

Revanth Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ

Aug 13 2022 10:26 AM | Updated on Aug 13 2022 7:22 PM

TPCC Chief Revanth Reddy Said Sorry to MP Komatireddy venkat Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పారు. చండూరు సభలో అద్దంకి దయాకర్‌ కోమటిరెడ్డిపై చేసిన పరుష వ్యాఖ్యలకు రేవంత్‌ బహిరంగంగా క్షమాపణ కోరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే తనకు గౌరవం ఉందన్నారు.

తెలంగాణ సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. క్రమశిక్షణను ఉల్లంఘించిన దయాకర్‌పై చర్యలు ఉంటాయన్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఈ విషయాన్ని క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డికి తెలియజేస్తానని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. 

చదవండి: (Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement