అమేథీ ప్రజల్ని రాహుల్‌ గాంధీ నమ్మడం లేదు | Sakshi
Sakshi News home page

అమేథీ ప్రజల్ని రాహుల్‌ గాంధీ నమ్మడం లేదు

Published Sat, Mar 9 2024 12:44 PM

Rahul Gandhi Does Not Trust The People Of Amethi Union Minister Giriraj Singh Says - Sakshi

బెగుసరాయ్, బీహార్:  లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచే మళ్లీ పోటీ చేయనున్నారు. 

అయితే రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయడంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్  స్పందించారు. రాహుల్‌ గాంధీ అమేథీ ప్రజలను విశ్వసించడం లేదు. అమేథీ ప్రజలు  ఇందిరా గాంధీకి, వారి కుటుంబాన్ని గౌరవిస్తూ వస్తున్నారు. 

కానీ గత 5 సంవత్సరాలలో, వారు (కాంగ్రెస్ పార్టీ) అమేథీ ప్రజలను అగౌరవపరిచారు. కాబట్టే మైనారిటీ ప్రజలు ఎక్కువ మంది వాయనాడ్‌ను నమ్ముతున్నారు. రాహుల్‌ గాంధీ అక్కడి నుంచే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. 

Advertisement
 
Advertisement