
40 ఏళ్లుగా టీడీపీకి మద్దతిస్తున్న ‘బలమైన' వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైందని,
సాక్షి, తాడేపల్లి: టీడీపీపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. అధినాయకుడు కరప్షన్ కేసులో జైలుపాలైనా.. పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోందని తెలిపారు. త్వరలోనే టీడీపీ పార్టీ రెండు మూడు ముక్కలుగా చీలిపోవచ్చని అన్నారు. 40 ఏళ్లుగా టీడీపీకి మద్దతిస్తున్న ‘బలమైన' వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైందని, బాబు దోపిడీలను తామెందుకు సమర్థించాలన్న ఆలోచనలో పడ్డారని పేర్కొన్నారు.
కాగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును నాయుడిని ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గత 23 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్లు కోర్టులో విచారణ దశలో ఉన్నాయి.
చదవండి: చంద్రబాబు అరెస్ట్.. స్కామ్స్, కేసుల అప్‌డేట్స్
అధినాయకుడు కరప్షన్ కేసులో జైలుపాలైనా పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. త్వరలోనే ఆ పార్టీ రెండు మూడు ముక్కలుగా చీలిపోవచ్చు. 40 ఏళ్లుగా పార్టీకి మద్ధతిస్తున్న ‘బలమైన’ వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైంది. ఆయన దోపిడీలను తామెందుకు…
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 2, 2023