బీజేపీ మరో జాబితా: డైమండ్‌ హార్బర్‌ నుంచి అభిజిత్‌ దాస్‌ | Lok Sabha Elections: BJP Releases 12th Candidate List, Abhijit Das Bobby From Diamond Harbour - Sakshi
Sakshi News home page

బీజేపీ మరో జాబితా: డైమండ్‌ హార్బర్‌ నుంచి అభిజిత్‌ దాస్‌

Published Tue, Apr 16 2024 12:17 PM

bjp releases 12th candidate list Abhijit Das Bobby from Diamond Harbour - Sakshi

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ మొదటి దశ పోలింగ్‌ సమీపిస్తున్న వేళ అభ్యర్థుల మరో జాబితా విడుదల చేసింది. మంగళవారం బీజేపీ 12వ అభ్యర్థల జాబితాను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్‌ హార్బర్‌ నుంచి అభిజిత్‌ దాస్‌ (బాబీ)ని బరిలో నిలిపింది. ఇక్కడ టీఎంసీ తరఫున సీఎం మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్‌ బెనర్జీ పోటీ చేస్తున్న విసయం తెలిసిందే.

12 జాబితాలోని అభ్యర్థులు వీరే..
సతారా(మహారాష్ట్ర)-ఉదయన్‌రాజే భోంస్లే, ఖదూర్ సాహిబ్‌ (పంజాబ్)-మంజీత్ సింగ్ మన్నా మియావింద్, హోషియార్‌పూర్ (పంజాబ్)- అనితా సోమ్ ప్రకాష్, బటిండా( పంజాబ్)- పరంపాల్ కౌర్ సిద్ధూ, ఐఏఎస్, ఫిరోజాబాద్, (ఉత్తరప్రదేశ్) ఠాకూర్ విశ్వదీప్ సింగ్, డియోరియా (ఉత్తరప్రదేశ్)-శశాంక్ మణి త్రిపాఠిని పోటీలో నిలిపింది.

అదే విధంగా తెలంగాణలోని  సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప​ ఎ‍న్నికల అభ్యర్థిగా డా. టీఎన్‌  వంశీ తిలక్‌ను బరిలోకి దించింది.

21 మంది అభ్యర్థులతో ఒడిషా అసెంబ్లీ ఎన్నికల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది.

Advertisement
 
Advertisement