2 నుంచి ‘సింగరేణి పోరుగర్జన ’
● కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు
గోదావరిఖని: సింగరేణి పరిరక్షణ లక్ష్యంగా వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు సింగరేణి పోరుగర్జన కార్యక్రమం నిర్వహిస్తామని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు రియాజ్‌అహ్మద్, ఐ. కృష్ణ, కామర గట్టయ్య తెలిపారు. నగరంలోని హెచ్‌ఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఐక్యవేదిక స మావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై ఇందు లో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నా లుగు లేబర్ కోడ్‌లు రద్దు చేసే వరకు ఉద్యమించాలన్నారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బాకులను సంస్థకే చెందేటట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వంతో చర్చించాలని కోరారు. బొగ్గు బ్లాక్‌ల వే లంలో సింగరేణి పాల్గొనద్దని, సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డును యథావిధిగా కొనసాగించాలని, మారుపేరు కార్మికుల వా రసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. గోలేటి నుంచి సత్తుపల్లి వరకు పోరుగర్జన కొనసాగుతుందని వెల్లడించారు. నాయకులు జి.రాములు, ఏడుకొండలు, రాజయ్య, కుమారస్వామి, దావు రమేశ్, రవి, చింతల శేఖర్, కొండి శ్రీనివాస్, బేగ్ రాజపోశం తదితరులు పాల్గొన్నారు.


