కాంగ్రెస్ నేతలతో సమావేశం
ఎలిగేడు(పెద్దపల్లి): పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తన స్వగ్రామం శివపల్లిలోని తన నివాసంలో ఆదివారం కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం ఎలా సాధించాలనే అంశంపై సుదీర్ఘంగా సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించుకునేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఎలిగేడు మండలంలోని 12 గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచు లను గెలిపించుకోవడం లక్ష్యంగా ముందుకు సాగా లని సూచించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు దుగ్యాల సంతోష్‌రావు తదితరులు పాల్గొన్నారు.


