గతేడాది స్టేట్ అవార్డు
ఎయిడ్స్ నిర్మూలనకు విస్తృతంగా చేపడుతున్న కార్యక్రమాలతో కరీంనగర్ జిల్లా ప్రథమస్థానంలో నిలవడంతో గతేడాది స్టేట్ అవార్డు వచ్చింది. వ్యాధి నియంత్రణకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలను గుర్తించి అవార్డు అందజేశారు. హెచ్‌ఐవీ బాధితులకు ఏఆర్‌టీ సెంటర్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. వారికి కావాల్సిన మందులు ఇవ్వడంతో పాటు సీడీ–4, వైరల్ లోడ్‌పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నాం. హెచ్‌ఐవీ నియంత్రణ మన చేతుల్లోనే ఉంది. ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి.
– ఎం.సదానందచారి,
ఐసీటీసీ కౌన్సెలర్, కరీంనగర్


