
డివైడర్లు నిర్మించాలి
మేడిపల్లి రోడ్డు నుంచి అన్నపూర్ణకాలనీ వరకు రోడ్డు మధ్య కొంతవరకే డివైడర్లు ఉన్నాయి. మిగతా రోడ్డుకు లేవు. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులు రోడ్డుపై ఉండటంతో చీకట్లో ఢీకొట్టి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
– తోట రవి, అన్నపూర్ణకాలనీ, ఎన్టీపీసీ
సెంట్రల్ లైటింగ్ అవసరం
మేడిపల్లి సెంటర్ – భరత్‌నగర్ బోర్డు మధ్య సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులు వెంటనే పూర్తిచేయాలి. విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు తవ్విన గుంతలతో రాత్రి వేళ కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు మధ్య డివైడర్లు లేక ప్రమాదాలు జరుగుతున్నాయి.
– గీట్ల లక్ష్మారెడ్డి, సీఐటీయూ నాయకుడు
రహదారి పరిశీలిస్తాం
మేడిపల్లి రోడ్డు ప్రాంతంలోని సమస్యలు పరిశీలిస్తాం. రోడ్డుపై పశువులను వదల కూడదు. యజమానులు పద్ధతులు మార్చుకోవాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం. రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకుంటాం. త్వరలోనే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం.
– అరుణశ్రీ, కమిషనర్, రామగుండం బల్దియా

డివైడర్లు నిర్మించాలి

డివైడర్లు నిర్మించాలి