
డిగ్రీ సీట్ల నిర్ధారణ నేటితో ఆఖరు
శాతవాహన యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న సీట్లు, భర్తీ వివరాలు...
శాతవాహనలో అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు: 36,060
విద్యా సంవత్సరం సీట్ల భర్తీ
2022–23 20218
2023–24 16419
2024–25 16500
2025–26 7629
(రెండు దశలు పూర్తయ్యాక)
శాతవాహన యూనివర్సిటీ
కరీంనగర్‌క్రైం: డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ మూడు దశలు పూర్తయ్యాయి. మూడో దశ సీట్ల కేటాయింపు చేపట్టారు. ఇందులో శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని మొత్తం కళాశాలల్లో 36,060 సీట్లకు గాను మొదటి, రెండో విడతలో 9,455 సీట్లు కేటాయించగా, 6,730 మంది విద్యార్థులు అడ్మిషన్ ఖరారు చేసుకున్నారు, ఇంకా 29,330 సీట్లు ఖాళీగా ఉండగా మూడో విడతలో 7,629 సీట్లు కేటాయించింది. మూడో విడతలో 13 ప్రభుత్వ కళాశాలలో 1,060 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరిగింది. అలాగే మూడు ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో 1,046 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. 60 ప్రైవేట్ కళాశాలల్లో 5,523 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.
నేటితో ఆఖరు
ఇప్పటికీ మూడు దఫాల్లో సీట్లు కేటాయింపు కాగా ఆయా విద్యార్థులు ప్రవేశాలు ఆన్‌లైన్‌లో చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి జూలై 1వతేదీ వరకు అవకాశం ఉంది. సీటు కన్ఫార్మ్ చేసుకోలేకపోతే రద్దవుతుందని శాతవాహన దోస్త్ అధికారులు తెలుపుతున్నారు. గతంలో కంటే తక్కువగానే సీట్ల భర్తీ జరుగుతుందని తెలుస్తోంది.
మిగిలింది స్పాట్ అడ్మిషన్లతోనే...
శాతవాహన యూనివర్సిటీలో మూడు దఫాల్లో అడ్మిషన్ల కేటాయింపు పూర్తికాగా మూడో దశలో సీటు కన్ఫార్మ్ చేసుకున్న తర్వాత ఎన్ని సీట్లు మిగిలాయో పూర్తిస్థాయిలో తెలుస్తుంది. తర్వాత మిగిలిన సీట్లు స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. విద్యార్థులు మొత్తం బీటెక్, మెడిసిన్‌తో పాటు వివిధ కోర్సుల వైపు ఆసక్తి చూపడంతో డిగ్రీ సీట్ల భర్తీ పడిపోతుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మూడోదశ సీట్ల కేటాయింపు పూర్తి
మిగిలిన సీట్లు స్పాట్ అడ్మిషన్లతో భర్తీ
తగ్గుతున్న డిగ్రీ సీట్ల భర్తీ
శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల వివరాలు...
ప్రభుత్వ కళాశాలలు – 13
ప్రభుత్వ అటానమస్ కళాశాలలు – 02
ప్రైవేట్ ఎయిడెడ్ – 02
ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ – 58
సోషల్ వెల్ఫేర్ – 03
ట్రైబల్ వెల్ఫేర్ – 02
బీసీ వెల్ఫేర్ – 03