
రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
ఓదెల: సీఎం రేవంత్‌రెడ్డి మంజూరు చేసిన రూ.200 కోట్లతో నియోజకవర్గంలో చురుకుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నా రు. ఆదివారం ఓదెలలో కల్యాణలక్ష్మి, రేషన్‌కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. రిటైర్డ్ సింగరేణి కార్మికులతో పాటు అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రూపునారాయణపేట మానేరుపై మూ డు జిల్లాల వారధికి రూ.80 కోట్లతో పనుల ప్రా రంభానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మంచినీటి పైపులైన్టు పూర్తి చేసి ఓదెలకు మంచినీటి ఎద్దడి లేకుండా చేస్తామన్నారు. విజ్జన్న ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు రైతులకు ఢోకాలేదని తెలిపారు. ఓదెలలో ఓదెల, కాల్వశ్రీరాంపూర్ రెండు మండలాలకు సబ్‌కోర్టు త్వరలో ప్రారంభమవుతుందని అన్నారు. కోర్టుకు పక్కాభవనం నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓదెల తహసీల్దార్ దీరజ్‌కుమార్, పొత్కపల్లి సింగిల్‌విండో చైర్మన్ సుమన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రేంసాగర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాహుల్‌గౌడ్ పాల్గొన్నారు.