సీపీకి ఉత్కృష్ట సేవా పతకం | - | Sakshi
Sakshi News home page

సీపీకి ఉత్కృష్ట సేవా పతకం

Jun 29 2025 3:02 AM | Updated on Jun 29 2025 3:02 AM

సీపీక

సీపీకి ఉత్కృష్ట సేవా పతకం

గోదావరిఖని: రామగుండం పోలీస్‌కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా ఉ త్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. పోలీస్‌శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఈపతకం అందజేస్తుంది. 2009 ఐపీఎస్‌ బ్యాచ్‌కి చెందిన అంబర్‌ కిశోర్‌ ఝా వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం పా టు వృత్తి నైపుణ్యంతో విధులు నిర్వర్తించినందుకు ఈపతకానికి ఎంపికచేశారు. ఈసందర్భంగా పలువురు పోలీసు అధికారులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.

‘సిమ్స్‌’కు 150 ఎంబీబీఎస్‌ సీట్లు

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(సిమ్స్‌) కాలేజీలో కొత్తగా 150 ఎంబీబీఎస్‌ సీ ట్ల ఏర్పాటుకు ఆమోదం లభించిందని ప్రిన్సిపాల్‌ హిమబింద్‌సింగ్‌ తెలిపారు. శనివారం నే షనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) ఈ సీట్లకు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చిందని వెల్లడించారు. నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సిమ్స్‌లో మెరుగైన విద్యాబోధనతోపాటు సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.

పాలిసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

గోదావరిఖనిటౌన్‌: స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో పాలిసెట్‌–2025 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన శనివారం ప్రారంభమైందని ప్రిన్సిపాల్‌ రమాకాంత్‌, కో ఆర్డినేటర్‌ సురేశ్‌కుమార్‌ తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు పాలిసెట్‌ ర్యాంక్‌ కార్డు, ప దో తరగతి మెమో, టీసీ, నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్‌, కులం, ఆదా యం సర్టిఫికెట్లు(1–1–2024 తర్వాత తీసుకు న్నవి), ఆధార్‌కార్డు, ఈడబ్ల్యూఎస్‌ ఓరిజినల్‌, జిరాక్స్‌లతో హాజరు కావాలని సూచించారు.

‘భట్టి’ ప్రకటనతో ఆశలు

రామగుండం: సుమారు ఏడాది క్రితం మూతపబడిన రామగుండంలోని 62.5 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ స్థానంలో 800 మెగావాట్ల థ ర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మించాలని విద్యుత్‌ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్ర మార్క చేసిన ప్రకటన నియోజకర్గ ప్రజల్లో ఆశ లు రేకెత్తిస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో విద్యుత్‌ వి నియోగం పెరుగుతుందని, ఇందుకు అనుగుణంగా జెన్‌కోలోని నిష్ణాతులైన ఇంజినీర్ల సేవ లు వినియోగించుకుంటూ అత్యాధునిక పరిజ్ఞానంతో 800 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని శనివారం హై దరాబాద్‌లో జరిగిన డైరెక్టర్ల సమావేశంలో ఎనర్జీ కార్యదర్శి, డైరెక్టర్లను భట్టి ఆదేశించారు. దీంతో కొత్త పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు కాబోతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కమిషనర్‌తో రజక నేతల భేటీ

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): సుల్తానాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ తిప్పరాజు రమేశ్‌ను రజక సంఘం నాయకులు శనివారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకే అందించి శాలువాతో సన్మానించారు. ర జక సంఘం నాయకులు నిట్టూరి శ్రీనివాస్‌, నిట్టూరి రాజేశం, నిట్టూరి అంజయ్య, దీపక్‌, కొత్తకొండ శ్రీనివాస్‌, తోటపల్లి సంతోష్‌, నిట్టూరి మైసయ్య, నిట్టూరి కృష్ణ, నిట్టూరి శ్రీనివాస్‌, చాతల శివ, బుత్కూరి శంకర్‌, నిట్టూరి ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు 9మంది

పెద్దపల్లిరూరల్‌: స్పోర్ట్స్‌ స్కూళ్లలో ప్రవేశం కో సం చేపట్టిన ఎంపిక పోటీల్లో జిల్లాకు చెందిన 9 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి సురేశ్‌ తెలిపారు. కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన విహాన్‌వర్ధన్‌, మెహన్నత్‌, రామగిరికి చెందిన ఈశ్వర్‌, జూలపల్లికి చెందిన అద్విత్‌చంద్ర, పాలకుర్తికి చెందిన కుశ్వంత్‌, కమాన్‌పూర్‌కు చెందిన మణిరిత్విక్‌, మంథని కి చెందిన రహమత్‌అలీ, సుల్తానాబాద్‌కు చెందిన రుషికే శ్‌, తేజిస్వి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న వారి లో ఉన్నారని పేర్కొన్నారు. హకీంపేటలో జరి గే పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ఎస్కార్ట్‌గా ప్రణయ్‌, వెంకటేశ్‌ వ్యవహరిస్తారన్నారు.

సీపీకి ఉత్కృష్ట సేవా పతకం 
1
1/2

సీపీకి ఉత్కృష్ట సేవా పతకం

సీపీకి ఉత్కృష్ట సేవా పతకం 
2
2/2

సీపీకి ఉత్కృష్ట సేవా పతకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement