
పేదలకు ప్రజాప్రభుత్వం అండ
ఎలిగేడు/జూలపల్లి/సుల్తానాబాద్(పెద్దపల్లి): అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వారికి అండ గా ఉంటోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఎలిగేడు, జూల పల్లి మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రేషన్‌కార్డులు, సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కు లు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోశారు. రహదారులు, కుల సంఘ భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. సుల్తానాబాద్ ఎస్‌వీఆర్ గార్డెన్‌లో కొత్త రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క రేషన్‌కార్డు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. తహసీల్దార్లు యాకన్న, స్వర్ణ, బషీరొద్దీన్, ఎంపీవో కిరణ్, ఏపీఎం సుధాకర్, ఆర్‌ఐలు చంద్రశేఖర్, జయలక్ష్మి, ఎంపీడీవోలు పద్మజ, దివ్యదర్శన్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్లు గండు సంజీవ్, ప్రకాశ్‌రావు, నాయకులు వేణుగోపాలరావు, సామ రాజేశ్వర్‌రెడ్డి, దుగ్యాల సంతోష్‌రావు, వెంకటేశ్వర్‌రావు, పుల్లారావు, పరుశరాములుగౌడ్, కొండ తిరుపతిగౌడ్, కొడయ్య, పెద్ది కుమార్, వెంకటసత్యం, రమేశ్, వెంకట్‌రెడ్డి, పూరెల్ల శ్రావణ్, బొద్దుల లక్ష్మణ్, నర్సింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ కమిషనర్
సుల్తానాబాద్/ఎలిగేడు: సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేశ్ ఎమ్మెల్యే విజయరమణారావును శివపల్లిలో కలిసి బొకే అందజేశారు. పలు విషయాలపై చర్చించారు.
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు