
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
గోదావరిఖని: శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. కమిషరేట్ కార్యాలయంలో శనివా రం ఆయన నేరసమీక్ష నిర్వహించారు. కేసుల ద ర్యాప్తులో ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ, శాసీ్త్ర య పద్ధతి అవలంబించాలన్నారు. ప్రతీరోజు ఒక గంట పెండింగ్ కేసులపై సమీక్షించాలన్నారు. మ హిళలపై జరిగే నేరాల్లో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. విధుల్లో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు. కార్యక్రమంలో మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భా స్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, మంచిర్యాల, పెద్దపల్లి, జైపూర్, బెల్లంపల్లి, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు మల్లారెడ్డి, ప్రకాశ్, కృష్ణ, వెంకటేశ్వర్లు, రవికుమార్, శ్రీనివాస్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.