
సొసైటీలకు నగదు అందజేయాలి
ప్రభుత్వం చేపపిల్లలకు మత్స్యకార సొసైటీలకు నగదు ఇవ్వాలి. దీంతో మత్య్యకారులే నాణ్యమైన చేపపిల్లలు కొనుగోలు చేసుకుంటారు. ప్రభుత్వం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లుకు అప్పజెప్పితే వారు నాణ్యతలేని, చిన్నసైజ్ పిల్లలను సరఫరా చేస్తున్నారు. దీంతో అవి ఎదగక ఆశించిన ఫలితం వస్తలేదు.
– గంధం వెంకటస్వామి, మత్స్యకారుడు
ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
చేపపిల్లల పంపిణీ పథకం అమలు చేస్తుందా? లేదా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఆలస్యంగా చేపపిల్లలు పంపిణీ చేస్తే సర్కారు లక్ష్యం నెరవేరదు. సకాలంలో పంపిణీ, సరఫరా చేయని కారణంగా ప్రైవేటుగా కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. ప్రభు త్వం వెంటనే స్పందించి చేపపిల్లలకు బదులు నగదు అందజేయాలి.
– గుండా రాజు, మత్స్యకారుడు

సొసైటీలకు నగదు అందజేయాలి