మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Jun 27 2025 4:47 AM | Updated on Jun 27 2025 4:47 AM

మాదక

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

జూలపల్లి: యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి స్వప్నరాణి సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండలంలోని పెద్దాపూర్‌ ఆదర్శ పాఠశాలలో చట్టాలపై అవగాహన కల్పించారు. పోక్సో, గృహహింస, బాల్య వివాహ నిరోధక చట్టాలను గురించి వివరించారు. ప్రిన్సిపాల్‌ షాదూల్‌, న్యాయవాదులు ఉద్దండ నవీన్‌, బర్ల రమేశ్‌, ర్యాకం ఝాన్సీరాణి, సంకీర్తన పాల్గొన్నారు.

ఎల్లంపల్లిలో 8.60 టీఎంసీలు

రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో 8.60 టీ ఎంసీల నీరుందని నీటిపారుదలశాఖ అధికా రులు గురువారం తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.60 టీఎంసీలు ఉందని పేర్కొన్నారు. గతేడాది జూన్‌ 26వ తేదీన 139.05 అడుగుల ఎత్తులో కేవలం 3.96 టీఎంసీలు మాత్రమే వరద నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం 477 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఎన్టీపీసీకి 102 క్యూసెక్కులు, హైదరాబాద్‌ మెట్రోకు 331 క్యూసెక్కులు, మొత్తంగా 653 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉంది. రైతులకు సాగు నీటి అవసరం వచ్చే నాటికి భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రైల్వేస్టేషన్‌ ఆదాయం పెంచేలా చర్యలు చేపట్టండి

రామగుండం: రామగుండం రైల్వేస్టేషన్‌కు రెవెన్యూ పెంచేందుకు చర్యలు చేపట్టాలని సికింద్రాబాద్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (డీసీఎం) సిఫాలికి డీఆర్‌యూసీసీ ప్రతినిధి అనుమాస శ్రీనివాస్‌ విన్నవించారు. గురువారం డీసీఎం రామగుండం రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. సికింద్రాబాద్‌ డివి జనల్‌ రైల్వే ప్రజాసంబంధాల ప్రతినిధి అనుమాస శ్రీనివాస్‌ డీసీఎంను రైల్వే అతిఽథి గృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. రామగుండం రైల్వేస్టేషన్‌ ప్రవేశద్వారంలో టికెట్‌ కలెక్టర్‌ లేకపోవడంతో పలువురు టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నారని, ప్లాట్‌ఫారం టికెట్‌ తీసుకోవడం లేదని అన్నారు. ఫలితంగా రైల్వేస్టేషన్‌ రెవెన్యూ కోల్పోతుందని తెలిపారు. డీసీఎం స్పందిస్తూ అతి త్వరలోనే టికెట్‌ కలెక్టర్‌ను ఏర్పాటు చేయాలని రామగుండం కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

సాంప్రదాయ పంటలకు స్వస్తి పలకాలి

పాలకుర్తి: రైతులు వాణిజ్య పంటల సాగువైపు దృష్టి సారించాలని కేవీకే రామగిరిఖిల్లా శాస్త్రవేత్త భాస్కర్‌ సూచించారు. పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లి గ్రామంలో గురువారం మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పాం సాగుపై అవగాహన సదస్సు నిర్వహించా రు. ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పాం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, రైతులు ఆయిల్‌ఫాం సాగుకు మొగ్గు చూపాల ని కోరారు. హార్టికల్చర్‌ అధికారి జ్యోతి, ఆయిల్‌పాం ఫీల్డ్‌ ఆఫీసర్‌ ప్రశాంత్‌ పాల్గొన్నారు.

విద్యుత్‌ సమస్యలా.. 1912ను సంప్రదించండి

పెద్దపల్లిరూరల్‌: విద్యుత్‌ సమస్యలను గుర్తిస్తే వెంటనే 1912 టోల్‌ఫ్రీ నంబరుకు సమాచారం ఇస్తే సత్వరమే పరిష్కారం చూపుతామని ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ మాధవరావు తెలిపారు. తెగిన, వేలాడుతున్న, లూజుగా ఉన్న తీగలను గమనిస్తే విద్యుత్‌ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. ఇళ్లలో బట్టలు ఆరేసేందుకు జీఐ వైర్లు కాకుండా వీలైనంత వరకు ప్లాస్టిక్‌ తాళ్లనే వాడాలని సూచించారు.

మాదక ద్రవ్యాలకు   దూరంగా ఉండాలి1
1/3

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

మాదక ద్రవ్యాలకు   దూరంగా ఉండాలి2
2/3

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

మాదక ద్రవ్యాలకు   దూరంగా ఉండాలి3
3/3

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement