
సింగరేణిలో సమ్మె సైరన్
● వచ్చేనెల 9న నిర్వహణకు ఏర్పాట్లు ● ప్రణాళిక సిద్ధం చేసిన కార్మిక సంఘాల జేఏసీ
గోదావరిఖని: సింగరేణిలో సమ్మె మేఘాలు అలు ముకుంటున్నాయి. కార్మిక చట్టాలను యథా విధి గా కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయవద్దని జాతీయ కార్మిక సంఘాలు వచ్చేనెల 9న ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఒక్కరోజు టోకెన్ సమ్మె పారిశ్రామిక ప్రాంతంలో ఎఫెక్ట్ చూపించనుంది. ఈ మేరకు బుధవారం గోదావరిఖనిలో కార్మిక సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించి సమ్మెను విజయవంతం చేయాలని నిర్ణయించాయి. అన్ని బొగ్గుగనులపై విస్తృతంగా ప్రచారం చేయాలని తీర్మానించాయి. వాస్తవానికి మే20న టోకెన్ సమ్మె చేయాలని భావించినా, పాకిస్థాన్‌తో యుద్ధం నేపథ్యంలో వాయిదా వేశాయి.
కార్మిక సంఘాల జేఏసీ భేటీ
సింగరేణిలో సమ్మె విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ సమావేశమైంది. టోకెన్ సమ్మెను విజయవంతం చేయడానికి అన్ని సంఘాలు ఏకమై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించాయి. అన్ని గనులపైకి వెళ్లి గేట్‌మీటింగ్‌తో సమ్మె చేయాలని కోరుతున్నాయి. వచ్చేనెల 9న నిర్వహించే సమ్మె విజయవంతం చేయాలనే పట్టుదలతో కార్మిక సంఘాలున్నాయి.
ప్రధాన డిమాండ్లు ఇవే
రద్దు చేసిన కార్మిక చట్టాలను కొనసాగించాలి. కొత్త లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలి. కోల్ ఆపరేషన్ ప్రయివేటువారితో చేయించడం పూర్తిగా మానుకోవాలి. సత్తుపల్లి ఓసీపీ ప్రయివేట్ సంస్థ ఓబీని సింగరేణి భూమిలో పోయడానికి అవకాశం ఇవ్వద్దు. తాడిచర్ల–2, వెంకటాపూర్ గనులను సింగరేణికే ఇవ్వాలి. సింగరేణికి రావాల్సిన రూ.40 వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించి సంస్థను ఆదుకోవాలి. సింగరేణిలో నూతన గనులు ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.
లేబర్‌కోడ్‌లకు వ్యతిరేకంగా సమ్మె
గోదావరిఖని: నాలుగు లేబర్ కోడ్‌ల రదు కు జూలై9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోరా రు. గురువారం జీడీకే–11గనిలో ఏర్పా టు చేసిన గేట్‌మీటింగ్‌లో మాట్లాడారు. సింగరేణి బొగ్గు, విద్యుత్తును వాడుకున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.26 వేల కోట్లు బకా యి పడిందని, వెంటనే చెల్లించాలన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.19 వేల కోట్లు బకాయి పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు బకాయి పడిందన్నారు. కనీసం రూ.10వేల కోట్లు సింగరేణి కార్మికుల సంక్షేమం, కొత్త గనులు, మెటీరియల్, యంత్రాల కొనుగోలు కు వినియోగించే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడం వల్ల సింగరేణి సంస్థ అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు. నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, కవ్వంపల్లి స్వామి, రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.