
మత్తుతో జీవితాలు చిత్తు
● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
రామగిరి: మత్తు పదార్థాల వినియోగంతో యువత భవిష్యత్ ప్రమాదంలో ఉందని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా గురువారం సెంటినరీకాలనీ జేఎన్టీయూలో అవగా హన సదస్సు నిర్వహించారు. ముందుగా ప్రిన్సిపా ల్ డాక్టర్ బులుసు విష్ణువర్ధన్ పూలమొక్క అందించి సీపీకి స్వాగతం పలికారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రమాణం చేయించి, పోస్టర్ ఆవిష్కరించారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్ నాశనం చేసుకోవద్దని అన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్, మంథని, గోదావరిఖని టూటౌన్ సీఐలు బొల్లపల్లి రాజుగౌడ్, ప్రసాద్‌రావు, రామగిరి, ముత్తారం, మంథని ఎస్సైలు తాడవేన శ్రీనివాస్, పురుషోత్తం దివ్యగౌడ్, నరేశ్, రమేశ్, నార్కొటిక్ ఎస్సై రాజేశ్ పాల్గొన్నారు.
డ్రగ్స్ నియంత్రణకు పాటుపడదాం
పెద్దపల్లిరూరల్: యువత వక్రమార్గంలో పయనించి భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దని అడిషనల్ కలెక్టర్ వేణు అన్నారు. పెద్దపల్లిలో గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చేపట్టిన ర్యాలీని డీసీపీ కరుణాకర్‌తో కలిసి ప్రారంభించారు. యువత చెడు అలవాట్లకు బానిసలైతే తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రులను క్షోభ పెట్టినవారవుతారనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఏసీపీ గజ్జికృష్ణ, జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్‌రావు, డీఎంవో ప్రవీణ్‌రెడ్డి, ఆర్టీవో రంగారావు పాల్గొన్నారు.

మత్తుతో జీవితాలు చిత్తు