
గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సొంతభవనాలు నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం సమీక్షించారు. జిల్లాలో 24 పంచాయతీలకు సొంతభవనాలను నిర్మించాల్సి ఉందని, అనువైన స్థలాలను ఎంపిక చేయాలని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఎంపిక చేయాలన్నారు. డీఎల్‌పీవో వేణుగోపాల్ పాల్గొన్నారు.
కేజీవీల్స్‌తో రోడ్డెక్కొద్దు
కేజీవీల్స్ ట్రాక్టర్లు రోడ్లపై తిరగడం వల్ల రోడ్లు పాడైపోతున్నాయని, కేజీవీల్స్‌తో రోడ్డెక్కితే జరిమానా చెల్లించాల్సిందేనని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కేజీవీల్స్‌తో నడుపుతూ తొలిసారి పట్టుబడితే రూ.5వేల జరిమానా విధిస్తామన్నారు. రెండోసారి రూ.10వేలు, మూడోసారి రూ.20వేల జరిమానా విధిస్తామన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయాధికారులు, పోలీసులు రోడ్లపై కేజీవీల్స్‌తో తిరిగే ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలన్నారు.