
నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసేవరకూ పోరాటం
● ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్
గోదావరిఖని: కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్‌కోడ్స్ రద్దు చేసేవరకూ పోరాటం చేయాలని ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్ కోరారు. బుధవారం స్థానిక యూనియన్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. దీనికి వ్యతిరేకంగా వచ్చేనెల 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, కార్మిక వర్గానికి నష్టం చేసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. అన్నిగనులపై గేట్ మీటింగ్‌లను నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. సమావేశంలో నాయ కులు సీతారామయ్య, ఈదునూరి నరేశ్, రామకృష్ణ, గౌని నాగేశ్వరరావు, టి.శ్రీనివాస్, మేకల రామ న్న, సంతోష్, దేవన్న, నర్సింగ్ పాల్గొన్నారు.