బహిరంగ చర్చకు సిద్ధమా? | - | Sakshi
Sakshi News home page

బహిరంగ చర్చకు సిద్ధమా?

Jun 26 2025 6:28 AM | Updated on Jun 26 2025 6:28 AM

బహిరం

బహిరంగ చర్చకు సిద్ధమా?

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లు పాడి కౌశిక్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌, శ్రావణ్‌ ఇటీవల కేంద్రమంత్రి బండి సంజయ్‌పై చేసిన ఆరోపణలు నిరూపించేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా? అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి సవాల్‌ చేశారు. స్థానిక ఆర్యవైశ్య భవనంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆ ఆరోపణలు నిరూపించేందుకు బహిరంగ చర్చకు సిద్ధపడాలన్నారు. తేదీని బీఆర్‌ఎస్‌ నాయకులే నిర్ణయించాలన్నారు. కరీంనగర్‌ కమాన్‌ చౌర స్తా, హుజూరాబాద్‌ చౌరస్తాలో ఎక్కడైనా చర్చ కు తాము సిద్ధమని ప్రకటించారు. నాయకులు కూకట్ల నాగరాజు, కందుల శ్రీనివాస్‌, కందుల సంధ్యరాణి, కడారి అశోక్‌రావు, సౌదరి మ హేందర్‌, మహేశ్‌, అమరగాని ప్రదీప్‌కుమార్‌, లంక శంకర్‌, చాతరాజు రమేశ్‌, కామని రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

‘బెస్ట్‌ అవైలెబుల్‌’ బకాయిలు చెల్లించాలి

పెద్దపల్లిరూరల్‌: బెస్ట్‌ అవైలెబుల్‌ స్కూల్‌ ప థకం కింద ప్రవేశాలకు ఎంపికైన విద్యా ర్థుల ను యాజమాన్యాలు తమ పాఠశాలల్లో చేర్చుకోవడంలేదని కేవీఎస్‌ జిల్లా కార్యర్శి కల్లెపల్లి అశోక్‌ ఆరోపించారు. ఫీజు చెల్లించి, పుస్తకా లు, యూనిఫామ్స్‌ను సొంత డబ్బులతోనే కొ నుగోలు చేయాలని మనోవేదనకు గురిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈమేరకు కలెక్టరేట్‌ ఎదుట బుధవారం నిరసన కార్యక్రమం చేప ట్టారు. ఆయన మాట్లాడుతూ, మూడేళ్లుగా బ కాయిల గురించి పట్టించుకోవడం లేదని, దీంతో దళిత, గిరిజన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తక్షణమే బకాయి లు విడుదల చేయాలని ఆయన కోరారు. నా యకులు మొదుంపల్లి శ్రావణ్‌, సురేశ్‌, లావణ్య, రమేశ్‌, శ్రీనివాస్‌, రవి, సంతోష్‌, గీత, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

నామినేటెడ్‌ పదవులిప్పించండి

పెద్దపల్లిరూరల్‌: నామినేటేడ్‌ పదవుల్లో యాద వులకు ప్రాధాన్యం కల్పించాలని అఖిల భార త యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం కోరారు. యాదవచారిటబుల్‌ ట్రస్టు కార్యాలయంలో గొర్రెకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు సలేంద్ర రాములు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకులు చిలారపు పర్వతాలు, మారం తిరుపతితో కలి సి ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా జీవాలకు మందులు ఇవ్వడంలేదన్న విషయాన్ని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లేందుకే గాంధీభవన్‌కు గొ ర్రెలను తోలుకొచ్చామని, అంతేతప్ప, ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు. జిల్లాకు చెంది న యాదవ నాయకులకే గొర్రెల పెంపకందారుల కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కేటాయించాలని, ఇందుకు మంత్రి శ్రీధర్‌బాబు సహకారం అందించాలని కోరారు. నాయకులు నాగరాజు, ఉప్పరి శ్రీనివాస్‌, మేకల నర్సయ్య, చంద్రమౌళి, సదయ్య తదితరులు ఉన్నారు.

నేడు ఎంపిక పోటీలు

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ ఐటీఐ గ్రౌండ్‌లో గురువారం స్పోర్ట్స్‌ పాఠశాలలకు విద్యార్థులను ఎంపికచేయనున్నారు. రాష్ట్రంలోని కరీంనగర్‌, ఆదిలాబాద్‌, హకీంపేటలో స్పోర్ట్స్‌ స్కూళ్లలో ఎంపిక కోసం అర్హులైన విద్యార్థులను ఎంపిక చేయనున్నా రు. ఆసక్తిగల విద్యార్థులు ఆధార్‌కార్డుతో పా టు స్టడీ సర్టిఫికెట్లు వెంట తీసుకు రావాలని డీవైఎస్‌వో సురేశ్‌ సూచించారు. ఎంపిక పోటీలకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

టెక్నీషియన్‌ పోస్టుల భర్తీ

గోదావరిఖని: రామగుండం డివిజన్‌–1 పరిధిలోని సర్ఫేస్‌ టెక్నీషియన్ల పోస్టులను బుధవారం భర్తీ చేశారు. ఇందుకోసం జీఎం కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఫిట్టర్‌ సర్ఫేస్‌ పోస్టుల కోసం 47 మంది దరఖాస్తు చేసుకోగా సీనియారిటీ ప్రాతిపదికన 8 పో స్టులు భర్తీ చేశారు. అలాగే 44 మంది ఎలక్ట్రీ షియన్‌ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోగా 7 పోస్టులకు ఎంపిక చేశారు. ఎస్‌వోటూ జీఎం గోపాల్‌సింగ్‌, ఇంజినీర్‌ వెంకటేశ్వర్‌రావు, ఏజీఎం ఆంజనేయులు, పర్సనల్‌ మేనేజర్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ చర్చకు సిద్ధమా? 1
1/2

బహిరంగ చర్చకు సిద్ధమా?

బహిరంగ చర్చకు సిద్ధమా? 2
2/2

బహిరంగ చర్చకు సిద్ధమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement