
బందీలను చేసి.. హక్కులు హరించి
● పౌరహక్కుల సంఘం నేతల నిరసన
పెద్దపల్లిరూరల్: ఎమర్జెన్సీ నిర్బంధపు చీకటి రోజులకు 50 ఏళ్లు నిండాయని, ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ 1975 జూన్ 25న అర్ధరాత్రి ఎమ ర్జెన్సీ ప్రకటించి 21 నెలల పాటు కొనసాగించారని పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్ర ధానకార్యదర్శి బొడ్డుపల్లి రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద బుధవారం ని రసన చేపట్టారు. ఎమర్జెన్సీతో ప్రజలను బందీలుగా చేసి హక్కులను హరించారని ఆరోపించారు. ఇప్పటి పాలకులు సైతం క్రూరమైన చట్టాలను అమలు చేస్తూనే ఉన్నారని విమర్శించారు. 1985లో టాడా, 2002లో పోటా, 2004 నుంచి ఉపా చట్టాన్ని తెచ్చి 2024 వరకు ప్రజలు, కళాకారులు, విద్యార్థులు, జర్నలిస్టులు, మేధావులను నిర్బంధించారని పేర్కొన్నారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్, సమాధాన్, ఆపరేషన్ పహార్ కొనసాగించిన పాలకులు.. 2025 జనవరి 1నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో 560 మంది ఆదివాసీ అమాయక ప్రజలను, విప్లవకారులను ఎన్‌కౌంటర్ల పేరిట హతమర్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు నార వినోద్, సహాయ కార్యదర్శి రెడ్డిరాజుల సంపత్ తదితరులు పాల్గొన్నారు.