
ఇది ప్రజల ప్రభుత్వం
● ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లిరూరల్/జూలపల్లి: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్ర జాసంక్షేమాన్ని విస్మరించారని ఎమ్మెల్యే విజయరమణారావు విమర్శించారు. పలువురు లబ్ధి దారులకు మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. జూలపల్లి మండలంలో చేపట్టిన వివి ధ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌కార్డులు, ఇందిరమ్మ, డబుల్‌బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చే స్తోందని తెలిపారు. కోతల్లేకుండా ధాన్యం కొనుగోలు, సన్నరకం క్వింటాల్‌కు రూ. 500 బోనస్ చెల్లిస్తోందన్నారు. అనంతరం ఏడుగురు దివ్యాంగులకు రూ.3,37,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఆదిరె డ్డి, ఎంపీడీవో పద్మ, తహసీల్దార్లు రాజయ్య, స్వర్ణ, పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూప, వైస్‌చైర్మన్ మల్లారెడ్డి, నాయకులు రామ్మూర్తి, మల్ల య్య, సంతోష్, శ్రీనివాస్, నర్సింహారెడ్డి, సంపత్, శంకర్, సంతోష్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.